కుక్కర్ లీకేజీ ఆగేదెలా
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:24 AM
కుక్కర్‌లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి దాని మూత నుంచి నీటి చుక్కలు స్టవ్ మీద పడుతుంటాయి. అంతేకాదు...
కుక్కర్‌లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి దాని మూత నుంచి నీటి చుక్కలు స్టవ్ మీద పడుతుంటాయి. అంతేకాదు కుక్కర్‌లోని ఆహార పదార్థాలు విజిల్ భాగం నుంచి బయటికి పొంగుతుంటాయి. ఇలాంటి లీకేజీ సమస్యలను నివారించేందుకు చిన్న చిట్కాలు...
కుక్కర్‌తోపాటు రబ్బర్ గ్యాస్కెట్, విజిల్, స్టీమ్ వాల్వ్, సేఫ్టీ వాల్వ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిలో ఆహార పదార్థాల అవశేషాలు చిక్కుకుని ఉంటే ఆవిరి నిలిచి నీరుగా మారి బయటికి లీకవుతుంది.
రబ్బర్ గ్యాస్కెట్ పాతబడినా, పగిలినా, వదులుగా మారినా, దాన్ని మూతలో సరిగా అమర్చకపోయినా నీరు బయటికి లీక్ అవుతుంది. వంట పూర్తయిన తరువాత గ్యాస్కెట్‌ను శుభ్రం చేసి కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఏడాదికి ఒకసారి గ్యాస్కెట్‌ను మార్చడం మంచిది. అప్పుడప్పుడు దానికి కొద్దిగా వంటనూనె రాస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
కుక్కర్‌కు మూత సరిగా ఫిట్ అయ్యేలా లాక్ చేయాలి.
కుక్కర్‌లో నిండుగా ఆహార పదార్థాలను నింపకూడదు. కనీసం పావు వంతు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా తగినన్ని నీళ్లు మాత్రమే కుక్కర్‌లో పోయాలి.
కుక్కర్‌లో వంట చేసేటప్పుడు స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అన్నం, పప్పు లాంటివి వండేటప్పుడు వాటిలో ఒక చుక్క నూనె వేస్తే అవి విజిల్ పైకి పొంగవు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..