స్టీల్ వాటర్ బాటిల్ శుభ్రంగా
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:38 AM
ఇటీవల స్టీల్ వాటర్ బాటిళ్ల వినియోగం ఎక్కువయింది. వాడుతున్న కొద్దీ బాటిల్ మూత, రబ్బర్ సీల్, అడుగు భాగాల్లో మురికి...
ఇటీవల స్టీల్ వాటర్ బాటిళ్ల వినియోగం ఎక్కువయింది. వాడుతున్న కొద్దీ బాటిల్ మూత, రబ్బర్ సీల్, అడుగు భాగాల్లో మురికి చేరడంతోపాటు అవి దుర్వాసన వస్తుంటాయి. వీటిని సులువుగా ఎలా శుభ్రం చేయాలో చూద్దాం...
ఒక కప్పు వేడినీటిలో చెంచా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిని స్టీల్ వాటర్ బాటిల్లో పోసి మూతపెట్టి వేగంగా ఊపి అరగంటసేపు అలాగే ఉంచాలి. తరువాత నీటిని వంచేసి బ్రష్‌తో రుద్ది మంచినీటితో కడిగేస్తే దుర్వాసన, మురికి తొలగి బాటిల్ శుభ్రమవుతుంది.
ఓ కప్పు వేడినీటిలో ఓ కప్పు వెనిగర్ వేసి బాగా కలిపి వాటర్ బాటిల్లో పోసి మూతపెట్టి గంటసేపు ఉంచాలి. తరువాత దాన్ని వేగంగా ఊపి మూత తీసి నీళ్లు వంచేసి లికిండ్ డిటర్జెంట్‌లో ముంచిన బ్రష్‌తో రుద్ది కడిగితే బాటిల్‌లో పేరుకున్న అవశేషాలు, మురికి తొలగిపోతాయి. అలాగే మూత కూడా శుభ్రమవుతుంది.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు