Share News

కర్టెన్లతో కొత్తగా...

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:11 AM

కిటికీలు, దర్వాజాలకు వేసే రకరకాల కర్టెన్లు ఇంటి అందాన్ని పెంచడంతోపాటు గదుల్లో అహ్లాదకరమైన అనుభూతిని పంచుతాయి. అలాంటి డిజైనరీ కర్టెన్ల వివరాలు...

కర్టెన్లతో కొత్తగా...

కిటికీలు, దర్వాజాలకు వేసే రకరకాల కర్టెన్లు ఇంటి అందాన్ని పెంచడంతోపాటు గదుల్లో అహ్లాదకరమైన అనుభూతిని పంచుతాయి. అలాంటి డిజైనరీ కర్టెన్ల వివరాలు...

  • పాతవి లేదంటే కట్టుకోని చీరలను పెద్ద కిటికీలకు కర్టెన్లుగా వేయవచ్చు. గోడ రంగులకు సరిపోలే డిజైన్‌ ఉన్న చీరలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. ఆ చీరల అంచులు గదిని శోభాయమానంగా మార్చేస్తాయి. చీర పలుచగా ఉంటుంది కాబట్టి గదిలోకి ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరిస్తాయి కూడా.

  • కాటన్‌ దారాలను పేర్చి చేత్తో అల్లిన మాక్రమే కర్టెన్లు.. ఇంటికి బోహేమియన్‌ లుక్‌నిస్తాయి. ఇవి సాధారణంగా లేత రంగుల్లో లభ్యమవుతుంటాయి. అందమైన ముడులతో జ్యామితీ ఆకృతుల్లో వేలాడే ఈ కర్టెన్లు ఇంటిని ప్రశాంతంగా మార్చేస్తాయి.

  • మింట్‌ గ్రీన్‌, లావెండర్‌, లేత నీలం రంగుల్లో లభ్యమయ్యే లేస్‌ ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన కర్టెన్లు ఇంటికి గ్రాండ్‌ లుక్‌నిస్తాయి. మామూలు కర్టెన్లకు ఈ లేసులను జోడించి సరికొత్త డిజైన్లను సృష్టించవచ్చు.

  • తెలుపు లేదా ఏవైనా లేత రంగుల్లో ఉన్న కర్టెన్ల మీద ప్రకాశవంతంగా కనిపించే రంగురంగుల పామ్‌ పామ్‌లను కుట్టి లేదా అతికించి విభిన్నమైన డిజైన్లను ఆవిష్కరించవచ్చు. ఇవి హాల్లో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

  • బలమైన దారాలకు రంగురంగుల పూసలు, అద్దాలు, చిన్న చిన్న పక్షులు లేదా జంతువుల బొమ్మలు, గవ్వలు, పువ్వులు, ఆకుల నమూనాలను గుచ్చి పొడవాటి స్ట్రిప్‌లను తయారుచేసి వాటిని పక్కపక్కగా వేలాడదీసి అందమైన కర్టెన్‌ తయారుచేయవచ్చు. ఇలాంటివి ప్రధాన ద్వారానికి, బాల్కనీ తలుపుకు, ఇంట్లో పార్టిషన్‌ ప్రదేశాలకు శోభనిస్తాయి.

ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 05 , 2026 | 05:12 AM