Share News

ఇంటి లోపలే ఒక ‘కేఫ్‌ వైబ్‌’

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:09 AM

కేఫ్‌లకు వెళ్లి కాఫీ తాగుతూ గడిపే సమయాన్ని ఇప్పుడు ప్రజలు తమ ఇంట్లోనే ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అందుకే ఒక ఇంటి మూలన ‘మినీ కాఫీబార్‌’ లేదా ‘టీ స్టేషన్‌’...

ఇంటి లోపలే ఒక ‘కేఫ్‌ వైబ్‌’

కేఫ్‌లకు వెళ్లి కాఫీ తాగుతూ గడిపే సమయాన్ని ఇప్పుడు ప్రజలు తమ ఇంట్లోనే ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అందుకే ఒక ఇంటి మూలన ‘మినీ కాఫీబార్‌’ లేదా ‘టీ స్టేషన్‌’ ఏర్పాటు చేయడం లేటెస్ట్‌ డెకర్‌ ట్రెండ్‌.

ఎలా డిజైన్‌ చేయాలి: లివింగ్‌ రూమ్‌ లేదా డైనింగ్‌ ఏరియాలో చిన్న ఖాళీ మూలను ఎంచుకోవాలి. అక్కడ వింటేజ్‌ స్టైల్‌ చెక్క టేబుల్‌ లేదా కన్సోల్‌ టేబుల్‌ ఉంచి దానిపై కాఫీ మెషీన్‌, రకరకాల మగ్గులు, టీ పొడుల డబ్బాలను అందంగా సర్దాలి. పైన గోడకు చిన్నచిన్న హుక్స్‌ తగిలించి మగ్గులను వేలాడదీస్తే అది పక్కా కేఫ్‌ లుక్‌ ఇస్తుంది.

పర్సనలైజ్డ్‌ టచ్‌: ఆ మూలనే ఒక చిన్న చాక్‌బోర్డ్‌ పెట్టి, దానిపై రోజుకో మంచి కోట్‌ రాయడం లేదా ఆ రోజు మెనూ రాయడం ఇంటికి వచ్చే అతిథులను ఆకట్టుకుంటుంది. అక్కడ చిన్న బార్‌స్టూల్‌ వేసి వార్మ్‌ లైటింగ్‌ పెడితే అది కేవలం కాఫీతాగడానికే కాదు, ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదవడానికి కూడా అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది. ఇది ఇంటికి ఒక మోడ్రన్‌, యూత్‌ఫుల్‌ వైబ్‌ని తెస్తుంది.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 02:09 AM