Share News

ఎముకల దృఢత్వం కోసం...

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:10 AM

మహిళలు ఎముకల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అవసరం. అందుకోసం సప్లిమెంట్ల మీదే ఆధారపడాలా? ఆహారం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుకునే వీలు...

ఎముకల దృఢత్వం కోసం...

బోన్‌ హెల్త్‌

మహిళలు ఎముకల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అవసరం. అందుకోసం సప్లిమెంట్ల మీదే ఆధారపడాలా? ఆహారం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుకునే వీలు లేదా? తెలుసుకుందాం!

ఎముకలకు అవసరమయ్యే పోషకాలు ఎముకల నిర్మాణంతో ముడిపడి ఉంటాయి. క్యాల్షియంతో ఎముకలకు సాంద్రత సమకూరితే, విటమిన్‌డి క్యాల్షియం శోషణకు సహాయపడుతుంది. ప్రొటీన్‌ కూడా కీలకమే! ఇది ఎముక లోపలి కొల్లాజెన్‌ ఫ్రేమ్‌వర్క్‌కు సహాయపడుతుంది. అయితే ఎముకల దారుఢ్యం కోసం అన్నిసార్లూ సప్లిమెంట్ల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. వైద్యులు సూచించినప్పుడు, పోషకాహార లోపం తలెత్తినప్పుడు మినహా ఎముకల దారుఢ్యం కోసం అదనపు సప్లిమెంట్ల వాడకం అవసరం లేదు. పాలు, పెరుగు, పన్నీర్‌, చీజ్‌లతో పాటు క్యాల్షియం ఫోర్టిఫైడ్‌ సోయా పాలు, టోఫు, నువ్వులు, బాదం, ఆకుకూరలు క్యాల్షియం భాండాగారాలే! కాబట్టి వీటిని తరచూ తింటూ ఉండాలి.

ఎంత క్యాల్షియం?

మహిళలు రోజుకు 800 నుంచి 1000 మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవాలని భారతీయ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఒక గ్లాసు పాలలో సుమారు 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. మిగతా క్యాల్షియంను ఆహారంతో భర్తీ చేసుకుంటే సరిపోతుంది. వెయ్యి గ్రాముల మోతాదును అందుకోలేని మహిళలకు సప్లిమెంట్లు అవసరమవుతాయి.

ఈ వార్తలూ చదవండి

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

Updated Date - Nov 03 , 2026 | 03:10 AM