చలికి చెక్కుచెదరకుండా..
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:44 AM
చలికాలం చర్మం పేచీ పెడుతుంది. మరీ ముఖ్యంగా ముఖ చర్మం పొడిబారి, నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి చలికాలం...
మేకప్
చలికాలం చర్మం పేచీ పెడుతుంది. మరీ ముఖ్యంగా ముఖ చర్మం పొడిబారి, నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి చలికాలం కోసం మేక్‌పకు ముందు చర్మాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎలాగంటే...
హైడ్రేషన్ తప్పనిసరి: చలికాలం చర్మం పొడిబారడం సహజమే అయినా, ప్రత్యేకమైన చర్మ రక్షణను తప్పనిసరిగా పాటించాలి. అందులో భాగంగా హైడ్రేటింగ్ క్లీన్సర్‌తో చర్మాన్ని శుభ్రపరిచి, టోనర్ అప్లై చేయాలి. తర్వాత హైడ్రేటింగ్ సీరమ్ లేదా ఫేస్ ఆయిల్ పూసుకోవాలి. చివర్లో మాయిశ్చరైజర్ అప్లై చేసి, ఆ తర్వాతే మేకప్ మొదలుపెట్టాలి. అప్పుడే వేసుకున్న మేకప్ ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ఉంటుంది.
ప్రైమర్ అవసరమే: వేసుకున్న మేకప్ పెచ్చులుగా ఊడిపోకుండా ఉండాలంటే మ్యాట్ ప్రైమర్‌ను ఎంచుకోవాలి. అప్పుడే చల్ల గాలులకూ, పడిపోయే ఉష్ణోగ్రతలకూ మేకప్ బిగదీసుకుపోకుండా ఉంటుంది.
హైడ్రేటింగ్ ఫౌండేషన్: మ్యాట్ ఫౌండేషన్‌కు ఈ కాలంలో ఫుల్‌స్టాప్ పెట్టేయాలి. బదులుగా సీరమ్ ఆధారిత ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. శాటిన్ లేదా ల్యూమినస్ ఫౌండేషన్ ఫార్ములాలు ఈ కాలానికి తగినవి. ఇవి చర్మానికి మెరుపునిస్తాయి. మరీ ముఖ్యంగా పొడి చర్మం కలిగిన వాళ్లు హైడ్రేటింగ్ ఫౌండేషన్‌నే ఎంచుకోవాలి. రెట్టింపు ఫలితం కోసం మ్యాట్ ఫౌండేషన్, మాయిశ్చరైజర్ లేదా ఫేస్ ఆయిల్ కలిపి అప్లై చేయాలి.
పౌడర్ బదులు క్రీమ్: ఈ కాలంలో పౌడర్ ఫార్ములాలు ముఖం మీద పొట్టు రేగడానికి తోడ్పడతాయి. బదులుగా క్రీమ్ బ్లషెస్, బామీ బ్రాంజర్స్, లిక్విడ్ హైలైటర్స్ ఎంచుకోవాలి. ఇవి చర్మంలో ఇంకిపోయి మెరుపునిస్తాయి.
పొరలు పొరలుగా: ఫౌండేషన్, బ్లష్, కాంటూర్‌ను పొరలు పొరలుగా అప్లై చేయాలి. ఈ ఉత్పత్తులు చర్మంలో ఇంకిపోయేవరకూ కొన్ని సెకన్ల పాటు ఆగాలి. తర్వాత బ్రష్‌తో బ్లెండ్ చేయాలి. ఇలాంటి లేయరింగ్ చిట్కాతో నున్నని మేకప్ లుక్ సొంతమవుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..