Share News

దగ్గు మందుతో తంటా!

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:19 AM

ఆస్తమా, ఎలర్జీ, సాధారణ దగ్గు... పిల్లల్లో దగ్గుకు పలు కారణాలుంటాయి. ‘దగ్గు ఎందుకొస్తోంది? అది ఎలాంటి దగ్గు?’ అనే విషయాలను అర్థం చేసుకుని కారణానికి చికిత్స చేయాలి. దగ్గుతో పాటు, ముక్కు నుంచి...

దగ్గు మందుతో తంటా!

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! పిల్లలకు దగ్గు వచ్చిన ప్రతిసారీ మెడికల్‌ షాపులో దొరికే దగ్గు మందు తాగిస్తూ ఉంటాం! ఇలా తాగించటం మంచిదేనా? దీంతో పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుందా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

ఆస్తమా, ఎలర్జీ, సాధారణ దగ్గు... పిల్లల్లో దగ్గుకు పలు కారణాలుంటాయి. ‘దగ్గు ఎందుకొస్తోంది? అది ఎలాంటి దగ్గు?’ అనే విషయాలను అర్థం చేసుకుని కారణానికి చికిత్స చేయాలి. దగ్గుతో పాటు, ముక్కు నుంచి నీరు కారుతూ, పిల్లి కూతలు వినిపిస్తుంటే దాన్ని అలర్జీగా భావించి యాంటీ హిస్టమిన్లు, యాంటీ అలర్జిక్‌ మందులు వాడాల్సి ఉంటుంది. వాటితోపాటు అలర్జీ కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉంచాలి. దగ్గుతోపాటు ఆయాసం ఉంటే, ఆస్తమాగా భావించి అందుకు తగిన ఇన్‌హేలర్లు వాడాల్సి ఉంటుంది. సాధారణ దగ్గు, జలుబు అయితే 3 నుంచి 5 రోజుల్లో తగ్గుతుంది. ఆ సమయంలో హైడ్రేషన్‌, ఆవిరి పడితే సరిపోతుంది. ఆస్తమా దగ్గును నెబ్యులైజేషన్‌తో తగ్గించవచ్చు. ఒక్కో రకం దగ్గుకు ఒక్కో రకం చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. మెడికల్‌ షాపుల్లో దొరికే దగ్గు మందుల్లో కాంబినేషన్‌ డ్రగ్స్‌ ఉంటాయి. కొన్నిట్లో అలర్జీ నివారిణులైన యాంటీ హిస్టమిన్లు ఉంటాయి. మరికొన్నిట్టో కోడీన్‌, హైడ్రాక్సీ కోడీన్‌ మందులుంటాయి. వీటి వాడకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బహిష్కరించింది. ఇష్టారాజ్యంగా వాడటం వల్ల ఆ మందులకు లొంగని ఆరోగ్య సమస్యను మనమే చేతులారా పెంచి పోషించినవాళ్లం అవుతాం! ఇది ప్రమాదకరం. కాబట్టి దగ్గు సిరప్స్‌ వాడేయకుండా, వైద్యులను సంప్రతించి, దగ్గు కారణానికి తగిన చికిత్స ఇప్పించాలి.

డాక్టర్‌ దినేష్‌ కుమార్‌ చిర్ల

పిడియాట్రీషియన్‌ అండ్‌ నియో నాటాలజిస్ట్‌,

హైదరాబాద్‌

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 06 , 2026 | 03:19 AM