స్నేహంగా మెలగండి
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:56 AM
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మెలగడంవల్ల అది వారి ఎదుగుదల మీద బలమైన ముద్ర వేస్తుందని, సామాజిక అంశాల పట్ల అవగాహన ఏర్పడుతుందని మానసిక నిపుణులు...
పేరెంటింగ్
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మెలగడంవల్ల అది వారి ఎదుగుదల మీద బలమైన ముద్ర వేస్తుందని, సామాజిక అంశాల పట్ల అవగాహన ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ పిల్లలతో కొంత సమయం గడపాలని, తరచూ వాళ్లతో మాట్లాడుతూ ఉండాలని చెబుతున్నారు.
పిల్లలు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వాళ్లు చెప్పేది వినాలి. సౌమ్యంగా తగిన సలహాలు ఇవ్వాలి.
చిన్న చిన్న పనుల్లో పిల్లలను భాగస్వాములను చేయాలి. చక్కగా పని పూర్తిచేసినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలి.
పిల్లలతో కలిసి వాకింగ్, యోగా, ధ్యానం లాంటివి చేస్తుండాలి. సైకిల్ తొక్కడం, షటిల్ ఆడడం, ఇండోర్ గేమ్స్ ఆడడం లాంటివి పిల్లలకు ఆనందాన్నిస్తాయి.
పండ్లు- కూరగాయలు కొనడం, వాటిని ఫ్రిజ్‌లో సర్దడం లాంటి పనులను అప్పజెబితే పిల్లలు ఆసక్తిగా చేస్తారు.
ఇంటికి బంధు మిత్రులు వచ్చినప్పుడు వారిని పలకరించడం, ఆతిథి మర్యాదలు చేయడం లాంటి పనులను పిల్లలకు అప్పగించాలి.
తోటపని, ఇంట్లో సామాన్లు సర్దడం, ఇంటిని శుభ్రం చేయడంలో పిల్లల సహాయం తీసుకోవాలి.
షాపింగ్ చేసేటప్పుడు పిల్లల అభిప్రాయం అడగడం వల్ల వారిలో నిర్ణయాధికారం, స్నేహభావం పెరుగుతాయి.
వంటచేసేటప్పుడు, వంటగది శుభ్రం చేసేటప్పుడు కూడా పిల్లలను సహాయం చేయమని అడగాలి. దీనివల్ల పిల్లలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం నేర్చుకుంటారు.
పిల్లలపై కోపంగా అరవడం, విసుగును ప్రదర్శించడం చేయకూడదు. మృదుస్వరంతో చెప్పాల్సిన విషయాన్ని క్లుప్తంగా అర్థమయ్యేలా చెబితే చాలు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!