బరువు తగ్గడం లేదా?
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:48 AM
ఆహార నియమాలు, వ్యాయామాలు బరువును తగ్గించలేకపోతే, అందుకు మూల కారణాలను అన్వేషించాలి. ఎక్కవ మందికి తెలియని ఆ కారణాలు ఇవే!...
ఆహార నియమాలు, వ్యాయామాలు బరువును తగ్గించలేకపోతే, అందుకు మూల కారణాలను అన్వేషించాలి. ఎక్కవ మందికి తెలియని ఆ కారణాలు ఇవే!
కార్డియో: ఈ వ్యాయామాలతో మాత్రమే కొవ్వు కరుగుతుందనుకోవడం పొరపాటు. కొంతకాలానికి ఈ వ్యాయామాలు శరీరానికి అలవాటైపోతాయి. విశ్రాంత స్థితిలో అత్యంత స్వల్ప మోతాదు క్యాలరీలే ఖర్చవుతూ ఉంటాయి. దీనికి తోడు కండర క్షీణత కూడా మొదలవుతుంది. కాబట్టి కండర క్షీణతను అడ్డుకోవడం కోసం బరువులు ఎత్తాలి. కిలో శరీర బరువుకు ఒక గ్రాము చొప్పున ప్రొటీన్ తీసుకోవాలి. బరువులు ఎత్తడం వల్ల విశ్రాంత స్థితిలో కరిగే క్యాలరీల మోతాదు పెరుగుతుంది. కాబట్టి కార్డియోతో పాటు తప్పనిసరిగా వెయిట్ ట్రైనింగ్ చేయాలి
నిద్ర: నిద్ర తగ్గితే కొవ్వు కరిగే వేగం కూడా తగ్గుతుంది. నిద్రతో టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ స్రావాలు పెరుగుతాయి. కొవ్వు నిల్వతో సంబంధం ఉన్న కార్టిసాల్ స్రావం తగ్గుతుంది.
ద్రవరూప క్యాలరీలు: పండ్ల రసాలు, శీతల పానీయాలు, మిల్క్‌షేక్స్, మద్యాలకు దూరంగా ఉండాలి. ఈ పానీయాలన్నీ ఇన్సులిన్‌ను పెంచి, కొవ్వు కరిగే తీరును అడ్డుకుంటాయి
జీర్ణవ్యవస్థ: కడుపుబ్బరం, మలబద్ధకం, పేగుల్లోని బ్యాక్టీరియా అసమతౌల్యానికి సంకేతాలు. ఈ పరిస్థితి ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. పోషకాల శోషణ కుంటుపడుతుంది. కార్టిసాల్ పెరిగి కొవ్వు కరగడం మానేస్తుంది.
నీళ్లు: డీహైడ్రేషన్ కొవ్వు కరిగే వేగాన్ని మందగిస్తుంది. ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. అలాగే శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగాన్ని తగ్గిస్తుంది.
ఒత్తిడి: ఆహార నియమాలు, వ్యాయామాలు మాత్రమే కొవ్వును కరిగిస్తాయని అనుకోకూడదు. ఎన్ని నియమాలు పాటించినా ఒత్తిడిని అదుపులో పెట్టుకోకపోతే, ఏమాత్రం ఫలితం ఉండదు. కాబట్టి యోగా, ధ్యానంలతో ఒత్తిడిని వదిలించుకోవాలి.
ఈ వార్తలూ చదవండి:
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..