సెక్సువల్ కౌన్సెలింగ్ ఎవరికి? ఎందుకు?
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:54 AM
డాక్టర్! మా అబ్బాయికి పాతికేళ్లు. పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. కానీ వాడికి పెళ్లి మీద, అమ్మాయిల మీద ఆసక్తి లేదు. అలాగని అతను స్వలింగ సంపర్కుడూ కాదు. వాడి..
కౌన్సెలింగ్
డాక్టర్! మా అబ్బాయికి పాతికేళ్లు. పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. కానీ వాడికి పెళ్లి మీద, అమ్మాయిల మీద ఆసక్తి లేదు. అలాగని అతను స్వలింగ సంపర్కుడూ కాదు. వాడి స్నేహితులను వాకబు చేయిస్తే, వాడికసలు లైంగికపరమైన విషయాల పట్ల ఆసక్తి, పరిజ్ఞానం ఏమాత్రం లేదని తేలింది. మమ్మల్ని ఏం చేయమంటారు? మా వాడిని మార్చే మార్గమే లేదా?
- ఓ సోదరి, హైదరాబాద్
లైంగికపరమైన పరిపక్వత బాల్యంలో పిల్లలు పెరిగిన వాతావరణం ఆధారంగా ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లలను భయభక్తుల్లో పెంచుతూ, వారికంటూ వ్యక్తిగత ప్రపంచం లేకుండా, స్నేహితులతో కలవనివ్వకుండా, చదువే లోకంగా పెరిగే పిల్లల్లో లైంగికపరమైన అంశాల పట్ల ఆసక్తి వయసుతో పాటు పెరగకపోవచ్చు. అలాగే విపరీతమైన ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుని ఉన్న ఇంట్లో, నిత్యం పూజలు, పునస్కారాలతో గడిపే కుటుంబంలో పెరిగిన పిల్లల్లో కూడా ఇదే తరహా వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలు పెరిగే క్రమంలో వారు అంతర్ముఖులుగా తయారు కాకుండా చూసుకోవాలి. చదువు, ఇల్లే ప్రపంచంగా కాకుండా స్నేహితులతో తిరగనివ్వాలి. అవసరమైనంత స్వేచ్ఛ వారికి కలిగించాలి. కనీసం లైంగిక పరిజ్ఞానం ఏర్పడే వాతావరణానికి కట్టడి విధించకుండా ఉండాలి. కట్టడి, కట్టుబాట్ల మధ్య, విపరీతమైన క్రమశిక్షణ మధ్య పెరిగిన పిల్లలు పెరిగి పెద్దయి ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చు. కానీ, దాంపత్య జీవితంలో అపజయం పాలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారికి పెళ్లి చేసినా, కొంతకాలంలోనే విడాకులు తీసుకుంటారు. కాబట్టి మీ అబ్బాయికి సెక్సువల్ కౌన్సెలింగ్ ఇప్పించడం తప్పనిసరి. దీంతో లైంగిక ఆసక్తి, కోరికలను పుట్టించి, పెళ్లి, జీవిత భాగస్వామి అవసరం గురించి వైద్యులు కౌన్సెలింగ్ ఇస్తారు. మీ అబ్బాయిలో తప్పకుండా మార్పు వస్తుంది. కంగారు పడకండి.
డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్,
ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్..!