వీటికి విత్తనాలు లేవు..!
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:31 AM
విత్తనాలు లేకుండానే కొన్ని రకాల మొక్కలను పెంచవచ్చు. వాటి వివరాలు...
విత్తనాలు లేకుండానే కొన్ని రకాల మొక్కలను పెంచవచ్చు. వాటి వివరాలు...
అల్లం: దీని మీద కూడా రైజోమ్ అనే బుడిపె పెరుగుతుంది. దీన్ని కోసి మట్టిలో నాటితే అల్లం మొక్క పెరుగుతుంది.
ఉల్లిపాయ: ఉల్లి కాడలకు చివరలో బల్బు లాంటి భాగం ఉంటుంది. దీన్ని మట్టిలో నాటితే ఉల్లిపాయ మొక్క పెరుగుతుంది.
ఆలుగడ్డ: చాలా రోజులపాటు ఆలుగడ్డలను నిల్వ ఉంచితే వాటి మీద చిన్న బుడిపెల్లాంటి మొలకలు వస్తాయి. ఈ భాగాన్ని చాకుతో కోసి మట్టిలో నాటితే సులువుగా మొక్కలు పెరుగుతాయి. చల్లని వాతావరణంలో పొడిగా ఉన్న మట్టిలో ఆలుగడ్డ మొక్క ఏపుగా పెరుగుతుంది.
కలబంద: దీని కాండం వద్ద చిన్న చిన్న పిలకలు ఏర్పడుతుంటాయి. వీటిని జాగ్రత్తగా వేరు చేసి కుండీల్లో నాటుకుంటే కలబంద చక్కగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఎక్కువగా ఎండ తగులుతూ ఉండాలి. మట్టి ఎప్పుడూ తడిగా ఉండాలి.
వెల్లుల్లి: వెల్లుల్లి రెబ్బను మట్టిలో నాటితే చాలు. మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి.
స్ట్రాబెర్రీ: ఈ పండ్ల మీద చిన్న సైజు రన్నర్లు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా సేకరించి మట్టిలో నాటితే స్ట్రాబెర్రీ మొక్క పెరుగుతుంది. రోజంతా సూర్యరశ్మి సోకుతూ ఉంటే మొక్క ఏపుగా పెరుగుతుంది.
పుదీనా: దీని కాడలను మట్టిలో నాటి తరచూ నీళ్లు చిలకరిస్తూ ఉంటే మొక్క గుబురుగా పెరుగుతుంది. దీనికి రోజూ కొద్దిసేపు ఎండ తగిలేలా చూసుకోవాలి.
అరటి: దీని కాండానికి దగ్గరలో చిన్న పిలకల్లాంటి సక్కర్లు ఏర్పడతాయి. వీటిని జాగ్రత్తగా సేకరించి దూర దూరంగా మట్టిలో నాటితే అరటి మొక్కలు పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి
మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..