కూరగాయలు ఇలా శుభ్రం
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:21 AM
కూరగాయలను అంటిపెట్టుకుని ఉండే పురుగుమందులను వదిలించడం కోసం నీళ్లలో శుభ్రంగా కడగడం ఒక్కటే సరిపోదు. వాటిని బేకింగ్ సోడా కలిపిన నీళ్లలో పావు గంట నానబెట్టాలి...
చిట్కా
కూరగాయలను అంటిపెట్టుకుని ఉండే పురుగుమందులను వదిలించడం కోసం నీళ్లలో శుభ్రంగా కడగడం ఒక్కటే సరిపోదు. వాటిని బేకింగ్ సోడా కలిపిన నీళ్లలో పావు గంట నానబెట్టాలి. ఇలా చేస్తే, 96 శాతం పురుగుమందుల అవశేషాలు వదిలిపోతాయి. అందుకోసం లీటరు నీళ్లలో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి, ఆ నీళ్లలో కూరగాయలను పావు గంట పాటు నానబెట్టాలి. ఈ విధానంతో కూరగాయలకు అంటిపెట్టుకున్న పురుగుమందుల అవశేషాలు 96 శాతం మేరకు వదులుతాయని యూనివర్శిటీ ఆఫ్ మసాచ్యుసెట్స్ అధ్యయనం పేర్కొంటోంది. కొన్ని పురుగుమందులు పేగుల్లోని బ్యాక్టీరియాను హరిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి, హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. కాబట్టి హానికారక రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ చిట్కా పాటించాలి. కొందరు కూరగాయలను శుభ్రం చేసే నీళ్లలో వెనిగర్ కూడా కలుపుతూ ఉంటారు. కానీ బేకింగ్ సోడా క్షారత్వాన్నీ, వెనిగర్ ఆమ్లత్వాన్నీ కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రెండింటినీ కలపడం వల్ల నీటికి ఎలాంటి ప్రభావం లేకుండా పోతుంది.
ఇవి కూడా చదవండి..
క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఇరాన్..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..