వాత దోషం వదలాలంటే...
ABN , Publish Date - Nov 03 , 2026 | 03:13 AM
వాత దోషంలో తలెత్తే హెచ్చుతగ్గులు పలు మానసిక, భౌతిక లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. కాబట్టి వాత దోషం అదుపు తప్పిందని సూచించే...
ఆయుర్వేదం
వాత దోషంలో తలెత్తే హెచ్చుతగ్గులు పలు మానసిక, భౌతిక లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. కాబట్టి వాత దోషం అదుపు తప్పిందని సూచించే లక్షణాల మీద కన్నేసి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
మానసిక లక్షణాలు
ఆందోళన, భయం, భావోద్వేగాలు నియంత్రణ తప్పడం, ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, అదుపుతప్పే ఆలోచనలు, నిదల్రేమి అదుపు తప్పిన వాత దోషం ప్రధాన మానసిక లక్షణాలు.
భౌతిక లక్షణాలు
చర్మం పొడిగా, గరుకుగా మారడం, అపానవాయువులు, కడుపుబ్బరం, మలబద్ధకకం లేదా మలవిసర్జన క్రమం తప్పడం, కీళ్ల నొప్పులు లేదా కీళ్లు బిగుసుకుపోవడం, అలసట లేదా నిస్సత్తువ, పాదాలు, చేతులు చల్లబడడం... అదుపు తప్పిన వాత దోషం ప్రధాన భౌతిక లక్షణాలు.
ప్రవర్తన సంకేతాలు
అవసరానికి మించి మాట్లాడుతూ ఉండడం లేదా వేగంగా మాట్లాడడం, దూకుడు ప్రవర్తన, రొటీన్‌ను అనుసరించలేకపోవడం, పనులు పూర్తి చేయలేకపోవడం, స్టిమ్యులేషన్ లేదా ఎక్సైట్‌మెంట్ కోసం వెతుక్కోవడం లాంటి ప్రవర్తన సంకేతాలు కూడా కనిపిస్తాయి.
వాతావరణ సంకేతాలు
చలి, గాలి, పొడి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, చలిని భరించలేకపోవడం, చలికాలాల్లో ఉదయం వేళ ఈ లక్షణాలు పెరిగిపోవడం లాంటి సంకేతాలు కూడా కనిపించవచ్చు.
ఏం తినాలి?
వాత దోషం కలిగిన వారు, పోషణనిచ్చే వెచ్చని పదార్థాల మీద దృష్టి పెట్టాలి. ఉడికించిన గింజలు, సూప్స్ తీసుకోవాలి. వేరు కూరగాయలు, శరీరాన్ని వెచ్చబరిచే సుగంధద్రవ్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. పచ్చి కూరగాయలు తినకూడదు. తెల్లన్నం, బ్రౌన్ రైస్, గోధుమలు, ఓట్స్, కిన్వా తీసుకోవాలి. క్యారట్స్, గుమ్మడి, చిలగడదుంప, బఠాణీ, టమేటాలు, సొరకాయ, ఆకుకూరలు తీసుకోవాలి. అరటి, నారింజ, మామిడి, ద్రాక్ష, ప్లమ్, అంజీర్, అవకాడొ తీసుకోవాలి. పాలు, నెయ్యి, వెన్న లాంటి పాల ఉత్పత్తులన్నీ తీసుకోవచ్చు. చికెన్, ఫిష్ తినొచ్చు.
ఈ వార్తలూ చదవండి
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ