Share News

కుండీల్లో చిలగడ దుంప..

ABN , Publish Date - Jul 01 , 2026 | 03:41 AM

మిద్దె తోటలో, బాల్కనీలో, ఇంటి పక్కన ఉన్న చిన్నపాటి స్థలంలో సులువుగా చిలగడ దుంపలను సాగు చేసుకోవచ్చు. ఆ వివరాలు...

కుండీల్లో చిలగడ దుంప..

మిద్దె తోటలో, బాల్కనీలో, ఇంటి పక్కన ఉన్న చిన్నపాటి స్థలంలో సులువుగా చిలగడ దుంపలను సాగు చేసుకోవచ్చు. ఆ వివరాలు...

  • ముందుగా వెడల్పాటి పెద్ద కుండీ లేదా పెద్ద సైజు గ్రోబ్యాగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

  • మట్టిలో పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు, సేంద్రియ ఎరువులు వేసి బాగా కలపాలి. ఆపైన కుండీ లేదా గ్రో బ్యాగ్‌లో ముప్పావు వంతు వరకు వదులుగా ఉండేలా ఆ మట్టిని నింపాలి.

  • నర్సరీ నుంచి ఆరోగ్యకరమైన చిలగడ దుంపల తీగల్ని తెచ్చి కనీసం 30 సెం.మీల పొడవుండే కొమ్మలుగా కత్తిరించాలి. ప్రతి కొమ్మకూ నాలుగు కణుపులు ఉండేలా చూసుకోవాలి. రెండు కణుపులు మట్టిలోకి వెళ్లేలా కొమ్మలు నాటాలి.

  • కుండీ లేదా గ్రో బ్యాగ్‌లో రెండు కొమ్మలు నాటవచ్చు. వాటికి బాగా సూర్యరశ్మి తగలాలి.

  • కొమ్మలు మట్టిలో నాటుకుని వేర్లు పెరిగే వరకు రోజూ నీటిని అందించాలి. కొమ్మలు తీగలుగా పాకడం మొదలుపెట్టాక మట్టి తడారినప్పుడు కొద్దిగా నీటిని చిలకరిస్తే సరిపోతుంది.

  • నాలుగు నెలల్లో ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి. అంటే వేర్ల వద్ద చిలగడదుంపలు కోయడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తించాలి.

ఇవి కూడా చదవండి

అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు

Updated Date - Jul 01 , 2026 | 03:41 AM