Share News

ఇలా స్నానం చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:51 AM

ఎండాకాలంలో చెమట వల్ల చిరాకుగా, అలసటగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ తీరి ఉత్సాహంగా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...

ఇలా స్నానం చేయాలి

ఎండాకాలంలో చెమట వల్ల చిరాకుగా, అలసటగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ తీరి ఉత్సాహంగా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...

  • చిన్న గిన్నెలో ఒక కప్పు పచ్చిపాలను తీసుకుని అందులో రెండు చెంచాల తేనె, గుప్పెడు గులాబీ రేకులు వేసి పావుగంటసేపు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఓ పెద్ద బకెట్‌ నీటిలో కలపాలి. అయిదు నిమిషాల తరువాత ఆ నీటితో స్నానం చేస్తే చర్మం తాజాగా మారడంతోపాటు అలసట తీరుతుంది.

  • ఒక బకెట్‌ చల్లటి నీటిలో చిన్న గ్లాసు కీరా రసం, పావు గ్లాసు పిప్పరమెంట్‌ టీ డికాషన్‌, రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ నీటితో స్నానం చేస్తే తాజా అనుభూతి కలుగుతుంది.

  • అయిదు గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ను ఒక లీటరు నీటిలో మరిగించి చల్లార్చి స్నానం చేసే నీటిలో కలుపుకున్నా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • ఒక బకెట్‌ గోరు వెచ్చటి నీటిలో చెంచా ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల రోజ్‌ ఆయిల్‌, చెంచా తేనె, చెంచా సువాసనభరితమైన పెర్ఫ్యూమ్‌ కలుపుకుని స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది.

  • స్నానం చేసే నీటిలో గులాబీ నీళ్లు, పుదీనా ఆకులు, వేపాకులు, గంధం పొడి, నిమ్మ చెక్కలు, నారింజ తొక్కలు, కలబంద గుజ్జు, ఓట్స్‌ పాలు లాంటివి కలుపుకున్నా అలసట తీరుతుంది. చర్మం మృదువుగా తాజాగా మారుతుంది.

  • లావెండర్‌ మొగ్గలు, మల్లె మొగ్గలు, చామంతి పూల రెక్కలను స్నానం చేసే నీటిలో కలుపుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో చెంచా యాపిల్‌ సైడర్‌ కలుపుకుని స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 19 , 2026 | 01:51 AM