Share News

ఆందోళనతో చర్మ వ్యాధులు

ABN , Publish Date - Apr 21 , 2026 | 02:54 AM

ఒత్తిడి, ఆందోళనలు చర్మం మీద కూడా ప్రభావాన్ని కనబరుస్తాయి. ఒత్తిడి సమయంలో శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌, ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి, చర్మపు...

ఆందోళనతో చర్మ వ్యాధులు

చర్మ ఆరోగ్యం

ఒత్తిడి, ఆందోళనలు చర్మం మీద కూడా ప్రభావాన్ని కనబరుస్తాయి. ఒత్తిడి సమయంలో శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌, ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి, చర్మపు సహజసిద్ధ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తుంది. ఎలాంటి భావోద్వేగాలతో ఎలాంటి చర్మ వ్యాధులు వేధిస్తాయో తెలుసుకుందాం!

అర్టికేరియా: ఆందోళన వ్యాధినిరోధకశక్తిని కుంటుపరుస్తుంది. ఫలితంగా బాహ్య అలెర్జన్లతో సంబంధం లేకుండా, చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి

డైషిడ్రోసిస్‌: ఆందోళన పెరిగితే, చేతులు, పాదాల మీద బొబ్బలు ఏర్పడి, చర్మం ఊడిపోయి, పొడిబారుతూ ఉంటుంది

కోల్డ్‌ సోర్‌: పెదవుల దగ్గర పుండ్లు పదే పదే వేధిస్తున్నా, ఒత్తిడిని కారణంగా అనుమానించాలి. ఒత్తిడి వ్యాధినిరోధకశక్తిని కుంటుపరిచి, శరీరం మీద నివసించే వైరస్‌ను శరీరం మీదే దాడి చేసేలా ప్రేరేపిస్తుంది

అలొపేసియా ఏరేటా: ఆందోళన పేను కొరుకుడుకు ఒక ప్రధాన కారణం. ఈ ఆటో ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ వెంట్రుకల కుదుళ్ల మీద దాడి చేసి, వెంట్రుకలు ఊడిపోయేలా చేస్తుంది

మొటిమలు: ఒత్తిడితో విడుదలయ్యే కార్టిసాల్‌ చర్మపు గ్రంథులను ప్రేరేపించి, బ్యాక్టీరియాకు తగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది

సోరియాసిస్‌: ఆందోళన చర్మపు కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా సోరియాసిస్‌ వేధిస్తుంది

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 02:55 AM