రోజంతా తాజాగా...
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:37 AM
కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, కార్యాలయాలకు వెళ్లే మహిళలు రోజంతా తాజాగా అహ్లాదకరంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం...
కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, కార్యాలయాలకు వెళ్లే మహిళలు రోజంతా తాజాగా అహ్లాదకరంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే...
రోజూ ఉదయాన్నే తప్పనిసరిగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. వేడి వేడి నీళ్లను కాకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే చర్మం తేమతో నిండుతుంది.
చర్మానికి అధికంగా చెమట పట్టే తత్వం ఉన్నవారు యాంటీ పెర్స్పిరెంట్ లేదా డియోడరెంట్‌లను వాడడం మంచిది.
శరీరానికి గాలి తగిలేలా వదులుగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవాలి. వేసవిలో చెమటను పీల్చుకునే కాటన్ డ్రెస్‌లు, చీరలు ధరించడం మంచిది. .
దుస్తులను ఉతికేటప్పుడు ఫ్యాబ్రిక్ కండిషనర్లు వాడితే అవి రోజంతా సువాసనలు వెదజల్లుతూ తాజా అనుభూతినిస్తాయి.
ముఖం జిడ్డుగా అనిపించినప్పుడు బేబీ వైప్స్‌తో తుడుచుకోవాలి. ఎలాంటి వాసన లేని క్లెన్సింగ్ వైప్స్ లేదా ఫేషియల్ వైప్స్‌ను కూడా వాడవచ్చు. చిన్నపాటి ఫేస్‌వా్‌షను వెంట ఉంచుకోవడం మంచిది.
మధ్యాహ్నానికల్లా శిరోజాలు జిడ్డుగా లేదంటే నిస్సారంగా మారిపోతుంటాయి. అలాంటప్పుడు డ్రై షాంపూతో సరిచేసుకోవాలి.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు