Share News

శోభిత నేచురల్‌ బ్యూటీ సీక్రెట్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:17 AM

మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం ఖరీదైన కాస్మెటిక్స్‌ అవసరం లేదని నిరూపిస్తున్నారు శోభిత ధూళిపాళ్ల. తన అందం వెనుక ఉన్న...

శోభిత నేచురల్‌ బ్యూటీ సీక్రెట్‌

మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం ఖరీదైన కాస్మెటిక్స్‌ అవసరం లేదని నిరూపిస్తున్నారు శోభిత ధూళిపాళ్ల. తన అందం వెనుక ఉన్న రహస్యం మన వంటింట్లో దొరికే వస్తువులేనని ఆమె చెబుతున్నారు.

గ్లామర్‌ ప్రపంచంలో మెరిసిపోయే తారలు అనగానే మనకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ గుర్తుకొస్తాయి. కానీ, ‘లవ్‌ సితార’ నటి శోభిత ధూళిపాళ శైలి వేరు. ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి అమ్మమ్మల కాలం నాటి చిట్కాలను నమ్ముతారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న తన ‘మార్నింగ్‌ రిచువల్‌’ (ఉదయపు అలవాట్లు) ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

నెయ్యి, కొబ్బరినూనె.. ఇదే నా మ్యాజిక్‌!

శోభిత తన రోజు వారీ సౌందర్య రక్షణలో ప్రకృతి సిద్ధమైన పదార్థాలకే పెద్దపీట వేస్తారు.

లిప్‌కేర్‌: పెదవుల తేమ కోసం ఆమె రోజూ ఉదయాన్నే నెయ్యి రాసుకుంటారు. ఇది పెదవులను మృదువుగా ఉంచుతుందని ఆమె నమ్మకం.

జుట్టు కోసం: జుట్టు చిక్కు పడకుండా ఉండేందుకు ఆమె ఒక చిన్న ట్రిక్‌ పాటిస్తారు. కొబ్బరినూనెను కొద్దిగా నీటితో కలిపి స్ర్పేలాగా ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు మంచి షైనింగ్‌ ఇస్తుంది.

చర్మం కోసం: స్కిన్‌ రాషెస్‌, డ్రైనెస్‌ వంటి ఏ సమస్యకైనా ఆమె కొబ్బరి నూనెనే బెస్ట్‌ రెమెడీగా భావిస్తారు.

నిపుణులు ఏమంటున్నారు?

శోభిత పాటించే ఈ పద్ధతులపై చర్మవ్యాధి నిపుణులు డాక్టర్‌ శ్వేతా నఖ్వా మాట్లాడుతూ.. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌-ఎ చర్మాన్ని రిపేర్‌ చేయడానికి తోడ్పతాయని చెప్పారు. అలాగే కొబ్బరినూనె ఇతర నూనెల కంటే జుట్టు లోపలి వరకు చొచ్చుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది జుట్టు చిట్లిపోకుండా చూస్తుందని డాక్టర్‌ శ్వేత చెప్పారు. ‘‘ఇది ప్రొటీన్‌ నష్టాన్ని తగ్గిస్తుంది. పొడిబారకుండా సాయపడుతుంది. ప్రీవాష్‌ ట్రీట్‌మెంట్‌లా బాగా పనిచేస్తుంది’’ అని వివరించారు. అయితే, జుట్టు రాలడం అనేది హార్మోన్ల సమస్యల వల్ల వస్తే మాత్రం కేవలం నూనెతో తగ్గదని, దానికి సరైన చికిత్స అవసరమని చెప్పారు.

మెరిసే చర్మం కోసం మరికొన్ని టిప్స్‌

కేవలం పైన రాసే నూనెలతోనే కాకుండా చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి.

హైడ్రేషన్‌: తగినంత నీరు తాగడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. అయితే కేవలం నీరు తాగడం వల్లే మొటిమలు, మచ్చలు తగ్గిపోవని గుర్తుంచుకోవాలి.

నిద్ర, ఆహారం: కంటి నిండా నిద్ర, పోషకాహారం చర్మం మెరవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జాగ్రత్త: సహజమైన పదార్థాలే కదా అని అందరూ అన్నింటినీ వాడకూడదు. కొందరికి నూనెల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చుండ్రు, సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 03:17 AM