Share News

స్మార్ట్‌ హౌస్‌ కీపింగ్‌

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:20 AM

ప్రతి ఇల్లు ఒక దేవాలయం వంటిదే. అలాంటి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా కళకళలాడుతూ ఉండాలంటే గృహిణికి కాస్త స్మార్ట్‌ ఆలోచనలు ఉండాలి. రోజూ కష్టపడి...

స్మార్ట్‌ హౌస్‌ కీపింగ్‌

ప్రతి ఇల్లు ఒక దేవాలయం వంటిదే. అలాంటి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా కళకళలాడుతూ ఉండాలంటే గృహిణికి కాస్త స్మార్ట్‌ ఆలోచనలు ఉండాలి. రోజూ కష్టపడి పనిచేయడం కంటే చిన్నచిన్న ట్రిక్స్‌తో ఇంటిని మెరిపించడం ఎలాగో చూద్దాం.

అద్దాల మెరుపు కోసం: మన ఇంట్లో ఉండే అద్దాలు లేదా కిటికీ గ్లాసులపై వేలి ముద్రలు, నీటి మరకలు పడి చూడటానికి ఇబ్బందిగా ఉంటాయి. మార్కెట్లో దొరికే కెమికల్స్‌ కంటే ఇంట్లోనే దొరికే వార్తా పత్రిక ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అద్దంపై కొద్దిగా నీళ్లు చల్లి పేపర్‌ను ఉండలా చుట్టి అద్దాన్ని తుడవండి. పత్రికలోని సిరా జిడ్డును పీల్చుకుని అద్దం కొత్తదానిలా మెరిసేలా చేస్తుంది.

చీమల బెడదకు చెక్‌: వంటగదిలో లేదా డైనింగ్‌ టేబుల్‌ దగ్గర చీమలు పెద్ద సమస్యగా మారుతుంటాయి. వీటిని వెళ్లగొట్టేందుకు లక్ష్మణరేఖలు వంటివి వాడుతుంటారు. అయితే, వీటికంటే దాల్చినచెక్క పొడి వాడండి. చీమలు తిరిగే చోట ఈ పొడిని చల్లితే ఆ ఘాటుకు అవి దరిచేరవు. అలాగే నిమ్మరసం కలిపిన నీటితో నేలను తుడిచినా చీమలు రావు.

వంటగది వాసనలు: నాన్‌ వెజ్‌ వండినప్పుడు లేదా సింక్‌ దగ్గర వచ్చే నీచు వాసన పోవాలంటే ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్‌ సోడా వేసి ఉంచండి. అది గాలిలోని దుర్వాసనను పీల్చుకుంటుంది. ఇక ఫ్రిజ్‌లో వచ్చే వాసనలకు సగం కోసిన నిమ్మకాయ రామబాణంలా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్

Updated Date - Mar 02 , 2026 | 05:20 AM