Share News

స్లీవ్‌లెస్‌ కుర్తీ... సూపర్‌!

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:10 AM

చిటపటలాడే ఎండాకాలంలో కూల్‌ కూల్‌గా ఉండాలనుకుంటే స్లీవ్‌లెస్‌ కుర్తీలు ఎంచుకోవాలి. కాటన్‌, లినెన్‌, రేయాన్‌....

స్లీవ్‌లెస్‌ కుర్తీ... సూపర్‌!

ఫ్యాషన్‌

చిటపటలాడే ఎండాకాలంలో కూల్‌ కూల్‌గా ఉండాలనుకుంటే స్లీవ్‌లెస్‌ కుర్తీలు ఎంచుకోవాలి. కాటన్‌, లినెన్‌, రేయాన్‌.. ఇలా పలు ఫ్యాబ్రిక్స్‌తో తయారవుతున్న అందమైన స్లీవ్‌లెస్‌ కుర్తీలు ఈ వారం మీ కోసం...

వేసవిలో చమటను పీల్చుకునే, ధారాళంగా గాలి చొరబడే దుస్తులకే ప్రాధాన్యమిస్తాం! ఆ కోవకు చెందినవే స్లీవ్‌లెస్‌ కుర్తీలు. జైపూర్‌, బాగు, బగ్రు, లినెన్‌... ఇలా పలు రకాల మన్నికైన కాటన్‌ ఫ్యాబ్రిక్స్‌తో అనేక డిజైన్లలో ఈ రకం కుర్తీలు రూపొందుతూ ఉంటాయి. వాటినెలా ఎంచుకోవాలో, ఏ బాటమ్‌తో కలిపి ధరించాలో తెలుసుకుందాం...

  • షార్ట్‌ కుర్తీ ఎంచుకుంటే బెల్‌బాటమ్‌ జీన్స్‌ లేదా లాంగ్‌ స్కర్ట్‌తో కలిపి ధరించవచ్చు

  • కాలర్‌ ఉన్న లాంగ్‌ స్లీవ్‌లెస్‌ కుర్తీలు పెన్సిల్‌ కట్‌ జీన్స్‌, షార్ట్‌ స్కర్ట్స్‌కు చాలా బాగా మ్యాచ్‌ అవుతాయి

  • వి నెక్‌, రౌండ్‌ నెక్‌ కుర్తీలను పలాజోలతో కలిపి ధరించవచ్చు

  • సెక్విన్‌ లేదా ఎండ్రాయిడరీ వర్క్‌ కలిగి ఉన్న విలాసవంతమైన కుర్తీలు వేడుకలకు అనువుగా ఉంటాయి

  • కలంకారీ కుర్తీలు సంప్రదాయబద్ధమైన సందర్భాలకు అనువైనవి

  • పూల ప్రింట్స్‌, జామెంట్రీ ప్రింట్స్‌ స్నేహితులతో హ్యాంగవుట్స్‌కు సూటవుతాయి

  • ఎలాంటి కుర్తీ ఎంచుకున్నా, భుజాలు దిగిపోకుండా చూసుకోవాలి. కాలర్‌ మరీ పెద్దగా, లేదా మరీ చిన్నగా ఉండ కూడదు

  • చేతికి వాచీ లేదా పెద్ద బ్యాంగిల్‌ ఈ తరహా కుర్తీలకు ఎంతో బాగా సూటవుతాయి

  • షరారా, లాంగ్‌ స్కర్ట్‌లతో కలిపి ధరించడం కోసం షార్ట్‌ కుర్తాలనే ఎంచుకోవాలి

  • కొల్హాపురి చెప్పులు, శాండిల్స్‌ ఈ తరహా కుర్తాలకు ఎంతో బాగా నప్పుతాయి

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 05:10 AM