Share News

స్లీప్‌ మాస్క్‌ మంచిదేనా..?

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:41 AM

కొంతమంది బెడ్‌లైట్‌ వెలుతురు కళ్లలో పడకుండా స్లీప్‌ మాస్క్‌ ధరించి నిద్రకు ఉపక్రమిస్తుంటారు. వీటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

స్లీప్‌ మాస్క్‌ మంచిదేనా..?

కొంతమంది బెడ్‌లైట్‌ వెలుతురు కళ్లలో పడకుండా స్లీప్‌ మాస్క్‌ ధరించి నిద్రకు ఉపక్రమిస్తుంటారు. వీటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

  • కళ్ల ఆకృతికి సరిపడేలా ఒంపుగా ఉండే కాంటూర్డ్‌ స్లీప్‌ మాస్క్‌ను ఉపయోగిస్తే కనురెప్పలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

  • మాస్క్‌ మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలి. ఎలాస్టిక్‌ ఉన్నవి, సర్దుబాటు చేసుకోవడానికి వీలుగా ఉండేవి ఎంపిక చేసుకోవడం మంచిది.

  • రాత్రిపూట పడుకునేముందు నైట్‌ క్రీమ్‌ లేదా మాయిశ్చరైజర్‌ రాసుకునేవారు చర్మానికి గాలి తగిలేలా వదులుగా ఉండే మాస్క్‌ ధరించాలి. లేదంటే చర్మ రంధ్రాలు మూసుకుపోయి చెంపల మీద వైట్‌ హెడ్స్‌, మొటిమలు వస్తాయి.

  • సింథటిక్‌, సిల్క్‌ మెటీరియల్స్‌తో రూపొందించిన వాటికంటే కాటన్‌ మాస్క్‌లు ధరించడం ప్రయోజనకరం. ఇవి చెమటను పీల్చుకుని కళ్లచుట్టూ పొక్కులు, దద్దుర్లు, పిగ్మెంటేషన్‌ రాకుండా కాపాడతాయి.

  • కళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు స్లీప్‌ మాస్క్‌ వాడకూడదు. అలాగే కళ్లు ఎర్రబడినప్పుడు, దురదగా అనిపించినా, కళ్ల కలక లాంటి ఇన్ఫెక్షన్లు సోకినా మాస్క్‌ పెట్టుకోకూడదు.

  • స్లీప్‌ మాస్క్‌ను తేలికపాటి సబ్బు లేదా బేబీ షాంపూతో తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేనిపక్షంలో దానిపై పేరుకునే చెమట, దుమ్ము, ధూళి, జిడ్డు వల్ల కళ్లకు హాని కలుగవచ్చు.

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 04:42 AM