Share News

వాషింగ్‌ మెషిన్‌ డోర్‌ తీసే ఉంచాలా...

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:02 AM

బట్టలు ఉతికిన తరువాత వాషింగ్‌ మెషిన్‌ డోర్‌ను కనీసం రెండు గంటలపాటు తీసే ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే...

వాషింగ్‌ మెషిన్‌ డోర్‌ తీసే ఉంచాలా...

బట్టలు ఉతికిన తరువాత వాషింగ్‌ మెషిన్‌ డోర్‌ను కనీసం రెండు గంటలపాటు తీసే ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే...

  • బట్టలు ఉతికిన తరువాత మెషిన్‌ లోపల, రబ్బర్‌ సీల్స్‌ వెనక నీరు చేరవచ్చు. వెంటనే తలుపు మూయడం వల్ల ఆ తేమ అలాగే ఉండి మెషిన్‌లో బ్యాక్టీరియా పెరగడం, బూజు పట్టడం, దుర్వాసన రావడం, తుప్పు ఏర్పడడం సంభవించవచ్చు. ఇవన్నీ మెషిన్‌ పనితీరును ప్రభావితం చేస్తాయి. కాబట్టి తేమ పూర్తిగా ఆరిపోయే వరకూ మెషిన్‌ తలుపును తెరచే ఉంచాలి.

  • బట్టలు ఉతకడం పూర్తయిన తరువాత పొడి గుడ్డతో రబ్బర్‌ సీల్‌ను, సర్ఫ్‌ లేదా లిక్విడ్‌ వేసే డ్రాయర్‌ను శుభ్రంగా తుడవాలి. అప్పుడు వాషింగ్‌ మెషిన్‌ డోర్‌ను కొద్దిసేపు తెరచి ఉంచితే సరిపోతుంది.

  • టాప్‌ లోడ్‌ మెషిన్లకు కూడా పని పూర్తయిన తరువాత కొద్దిసేపు మూతతీసి ఉంచడం మంచిది. దీనివల్ల లోపలి డ్రమ్‌.. తడి లేకుండా ఆరిపోతుంది. మెషిన్‌ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 05:03 AM