Share News

‘బ్రేవ్‌ సోల్‌’

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:53 AM

‘‘సవాళ్ళు ఎదురైన కొద్దీ నా సంకల్పం మరింత పదునెక్కుతుందం’’టారు షహీన్‌ మాలిక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలిగా నిస్సహాయస్థితి నుంచి... హక్కుల..

‘బ్రేవ్‌ సోల్‌’

‘‘సవాళ్ళు ఎదురైన కొద్దీ నా సంకల్పం మరింత పదునెక్కుతుందం’’టారు షహీన్‌ మాలిక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలిగా నిస్సహాయస్థితి నుంచి... హక్కుల ఉద్యమకారిణిగా అలుపెరుగని పోరాటాల వరకూ... ఆమెది స్ఫూర్తిమంతమైన ప్రస్థానం. ఢిల్లీలోని సామాన్య కుటుంబానికి చెందిన ఆమె... ఎంబీయే చదువుతూ ఒక కంపెనీలో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసేవారు. అక్కడ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒకరు ఆమెను వేధించి, లోబరుచుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అతను కక్ష పెంచుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్తూండగా... కిరాయి రౌడీలతో యాసిడ్‌ దాడి చేయించాడు. దీంతో ఆమెకు ఒక కన్ను పూర్తిగా, మరో కన్ను పాక్షికంగా దెబ్బతిన్నాయి. ‘‘ఇది 2009లో జరిగింది. నాకు పాతికకు పైగా సర్జరీలు జరిగాయి. లక్షల్లో డబ్బు ఖర్చయింది. ఒక కంటి చూపు పోయింది. చాలా రోజులు లోకానికి నా ముఖం చూపించలేకపోయాను. కానీ ‘దోషులు దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే... ఏ తప్పు చేయని నేను దేనికి భయపడాలి’ అనిపించింది. నాలాంటి బాధితుల కోసం పోరాడాలని నిశ్చయించుకున్నాను’’ అంటారు షహీన్‌.

మొదట్లో... యాసిడ్‌ దాడి బాధితుల కోసం పాటుపడే కొన్ని సంస్థల్లో ఆమె పని చేశారు. ఆ క్రమంలో బాధితుల దుస్థితి, వారి పట్ల ప్రభుత్వం, సమాజం చూపిస్తున్న ఉదాసీనత, అరకొరగా ఉన్న చట్టాలు కూడా సరిగ్గా అమలుకాని దుస్థితి... ఇవన్నీ అవగాహన చేసుకున్నారు. ‘బ్రేవ్‌ సోల్‌ ఫౌండేషన్‌’ పేరుతో ఒక సంస్థను 2021లో ప్రారంభించారు. వందలమంది బాధితులకు న్యాయపరంగా, భావోద్వేగపరంగా అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాయపడుతున్నారు. పదహారేళ్ళ సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత... ఆమెపై జరిగిన దాడి కేసు నిందితులను కిందటి ఏడాది డిసెంబర్లో... ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. అయితే ఆ పోరాటాన్ని అక్కడితో ఆపేది లేదంటున్నారు షహీన్‌.


సుప్రీంకోర్టు ఆదేశాల వెనుక...

మరోవైపు ఆమె దాఖలు చేసిన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు, తీర్పులు వెలువరించింది. ముఖ్యంగా... యాసిడ్‌ దాడికి గురై, అంతర్గతమైన గాయాలతో సతమతమవుతున్నవారికి పరిహారం, పునరావాసం కల్పించేలా దివ్యాంగుల చట్టాన్ని విస్తరించాలని ఈ ఏడాది ఇచ్చిన ఆదేశాలు ఆమె సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. అలాగే యాసిడ్‌ దాడి కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ విచారణలు చేపట్టాలని కూడా దేశవ్యాప్తంగా హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకొని, బాధితులకు పరిహారంగా ఎందుకు చెల్లించకూడదని ప్రశ్నించింది. బాధితులకు స్థిరమైన ఉపాధి, పునరావాస పథకాలను రూపొందించాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అయితే వీటన్నిటి అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అవసరమంటారు షహీన్‌.

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 04:53 AM