శిరోజాలకు సాంబ్రాణి
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:49 AM
శిరోజాలకు సాంబ్రాణి పొగ వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...
శిరోజాలకు సాంబ్రాణి పొగ వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...
వానలు కురుస్తున్నప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తలస్నానం చేసిన తరువాత శిరోజాలు త్వరగా ఆరవు. అలాంటప్పుడు సాంబ్రాణి పొగ వేస్తే ఆ వేడికి తేమ తగ్గి శిరోజాలు పొడిగా మారతాయి. ఈ పొగ సహజ పర్ఫ్యూమ్‌లా పనిచేసి శిరోజాలకు సువాసనను అందిస్తుంది. ఇది రెండు రోజుల వరకూ నిలిచి ఉంటుంది కూడా.
సాంబ్రాణి పొగలో యాంటీ మైక్రోబయల్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మాడుమీద సహజ నూనెలను కాపాడుతూ హానికార బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. ఫలితంగా తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు రావు. శిరోజాలు పెళుసుగా మారడం, వాటి చివర్లు చిట్లడం లాంటి సమస్యలు తలెత్తవు.
సాంబ్రాణి పొగ అందించే సున్నితమైన వెచ్చదనం సోకగానే మాడు మీద రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో తగిన పోషణ అంది కుదుళ్లు బలోపేతమవుతాయి. ఫలితంగా శిరోజాలు రాలడం తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి.
సాంబ్రాణికి ఉండే యాంటీ సెప్టిక్ గుణాల వల్ల తలలో కురుపులు, దురద లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
సాంబ్రాణి పొగ నుంచి వెలువడే సువాసనను పీల్చగానే తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చురుకుదనం పెరిగి ఉత్సాహంగా అనిపిస్తుంది. మహిళల్లో ఒళ్లు నొప్పులు, గర్భాశయ సమస్యలు తీరిపోతాయి.
నెలకు రెండుసార్లు సాంబ్రాణి పొగ వేస్తుంటే అది సహజ కండిషనర్‌లా పనిచేసి శిరోజాలు నల్లగా మెరుస్తూ ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్..!