Share News

సుగంధ ద్రవ్యాలే ఔషథాలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 02:58 AM

కొన్ని సుగంధద్రవ్యాలు, దినుసులు ఔషథ గుణాలను కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం!...

సుగంధ ద్రవ్యాలే ఔషథాలు

మీకు తెలుసా?

కొన్ని సుగంధద్రవ్యాలు, దినుసులు ఔషథ గుణాలను కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం!

  • రధుని/వైల్డ్‌ సెలరీ సీడ్స్‌: పశ్చిమ బెంగాలలో వంటల్లో విరివిగా ఉపయోగించే ఈ సుగంధద్రవ్యం చిరుచేదును కలిగి ఉంటుంది. మెంతులు, కాలో జీరా, రధుని, ఆవాలు, సోంపు.. ఈ ఐదు దినుసులతో తయారుచేసే మసాలాలో రధుని కీలక పాత్ర పోషిస్తుంది. కడుపుబ్బరం, అజీర్తిని పారదోలే ఈ మసాలాను బెంగాలీలు వంటకాల్లో విరివిగా వాడుతూ ఉంటారు

  • కల్పాసి/బ్లాక్‌ స్టోన్‌ ఫ్లవర్‌: తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువగా ఉపయోగించే ఈ సుగంధ ద్రవ్యాన్ని మనం బిరియానీ తయారీలో వాడుతూ ఉంటాం. చెట్టు బెరడు, రాళ్ల మీద పెరిగే ఈ నాచు సహజసిద్ధ యాంటీమైక్రోబియల్‌ గుణాలను కలిగి ఉంటుంది

  • మరాఠి మొగ్గ/డ్రైడ్‌ కపోక్‌ బడ్స్‌: కర్నాటక వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ సుగంధ ద్రవ్యాన్ని మనం బిరియాలో మాత్రమే వాడుకుంటాం. ఈ దినుసు జీర్ణశక్తిని మెరుగు పరిచి, పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది

  • అనార్‌దానా/డ్రైడ్‌ పొమెగ్రనేట్‌ సీడ్స్‌: ఉత్తర భారతీయ వంటకాల్లో ఎక్కువగా కనిపించే ఈ దినుసులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది

  • జఖియా/ వైల్డ్‌ మస్టర్డ్‌ సీడ్స్‌: ఉత్తరాఖండ్‌లో విరివిగా ఉపయోగించే ఈ దినుసు లేకుండా మన వంటలు కూడా పూర్తి కావు. తాలింపుల్లో ఉపయోగించే ఆవాలు మన మెటబాలిజంను పెంచుతాయి

  • గోంధొరాజ్‌/లెమన్‌ పీల్‌: పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువగా ఉపయోగించే నిమ్మ తోలులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి, వ్యాధినిరోధశక్తి పెరుగుతాయి

  • మెక్సికన్‌ మింట్‌/ఇండియన్‌ బొరేజ్‌: ఈ వాపు ఆకుతో మనం బజ్జీలు వండుకుంటూ ఉంటాం. ఈ ఆకు, దగ్గు, జలుబు, శ్వాసకోస సమస్యలకు విరుగుడుగా కూడా ఉపయోగపడుతుంది

  • మణిపురి బ్లాక్‌ రైస్‌: మణిపూర్‌కు చెందిన ప్రముఖ బాక్సర్‌ మేరీ కోమ్‌ ప్రధాన భోజనమిది. మణిపూర్‌ వాసులు ఎక్కువగా తినే ఈ నల్ల బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు, పీచు ఎక్కువ. ఈ బియ్యంతో గుండె ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 02:58 AM