పిల్లలు పొడవుగా...
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:48 AM
పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే వారికి చిన్నప్పటి నుంచీ పోషకాహారం తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పొడవుగా పెరిగేందుకు...
పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే వారికి చిన్నప్పటి నుంచీ పోషకాహారం తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పొడవుగా పెరిగేందుకు తోడ్పడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం...
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, చీజ్, జున్ను లాంటి ఆహార పదార్థాల్లో ఎ, బి, డి, ఇ విటమిన్లతోపాటు ప్రొటీన్లు, కాల్షియం లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజూ తినిపించడం వల్ల పిల్లలు బలంగా పొడవుగా పెరుగుతారు.
కోడిగుడ్లు: రోజూ గుడ్లు తినిపించడం వల్ల పిల్లలకు అవసరమైన ఎ, బి, డి విటమిన్లు; ప్రొటీన్లు, కోలిన్ లాంటి పోషకాలు లభిస్తాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు శారీరక పెరుగుదల మెరుగుపడుతుంది.
అరటి పండ్లు: వీటిలో కాల్షియం, మాంగనీస్, పొటాషియం లాంటి మినరల్స్; పీచు పదార్థాలు, పలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఉదయాన్నే అల్పాహారంతో పాటు ఒక అరటి పండును తినిపిస్తే జీవక్రియలు సజావుగా జరిగి ఎత్తు పెరుగుతారు.
చేపలు: వీటిలో కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, సిలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. కాబట్టి వారానికి ఒకసారైనా చేపలను పిల్లల ఆహారంలో చేర్చాలి.
ఆకు కూరలు: వీటిలో ఎ, సి, కె విటమిన్లు; కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ లాంటి మినరల్స్; పీచుపదార్థాలు, ఫోలేట్లు లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ ఒక ఆకుకూరను ఆహారంలో చేరిస్తే పిల్లలు పొడవుగా పెరుగుతారు.
ఇవి కూడా చదవండి
మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..