Share News

చదువులో రాణించేలా...

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:13 AM

పిల్లలు చదువులో రాణించాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

చదువులో రాణించేలా...

పిల్లలు చదువులో రాణించాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

  • పిల్లలకు సరైన దినచర్య, క్రమశిక్షణ అలవాటు చేయాలి. మంచి పోషకాహారాన్ని అందించాలి.

  • రోజూ చిన్నపాటి వ్యాయామాలు, యోగా లాంటివి చేయించాలి. అప్పుడే వారికి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరిగి బాగా చదువుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.

  • పిల్లలు రోజూ నిర్ణీత సమయంలో శ్రద్దగా చదువుకునేలా చూడాలి. దీనివల్ల పిల్లలు చదువుకు సంబంధించి మానసిక సంసిద్ధతను అలవరచుకుంటారు.

  • సెలవు రోజుల్లో పిల్లలచేత కథల పుస్తకాలు చదివించాలి. అప్పుడే వారికి భాషపై అవగాహన, పఠనాసక్తి పెరుగుతాయి.

  • పిల్లలు... ఎక్కువసేపు టీవీ చూడకుండా మొబైల్స్‌తో గడపకుండా నిబంధనలు విధించాలి. చదువుకునేటప్పుడు గాడ్జెట్స్‌ను దూరంగా ఉంచాలి. చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి.

  • పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు విసుక్కోకుండా ఓపికగా సమాధానాలు చేప్పాలి. దీంతో వారికి విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. కొత్త అంశాల గురించి చదివి తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది.

  • పిల్లలు సాధించిన మార్కుల గురించి కాకుండా వారు కష్టపడి చదివిన విధానాన్ని అభినందించాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, చదువుపై ఆసక్తి పెరుగుతాయి.

  • చదువు, ఆటలు, విశ్రాంతి తదితర అంశాలను సమతుల్యం చేసుకునే విధానాన్ని పిల్లలకు నేర్పించాలి. వారిని ఇతరులతో పోల్చకూడదు. చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని సాధించడం ఎలాగో తెలియజేయాలి.

  • బడిలో ఉపాధ్యాయులు వివరించిన పాఠాలను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఇచ్చిన హోమ్‌వర్క్‌లను సకాలంలో పూర్తిచేయడాన్ని పిల్లలకు అలవాటు చేయాలి.

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

Updated Date - Jun 04 , 2026 | 12:13 AM