పిల్లలు సరైన దారిలో...
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:32 AM
తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కోసారి పిల్లలు తప్పుదారి పడుతుంటారు. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో పిల్లలను సరైన దారిలోకి...
తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కోసారి పిల్లలు తప్పుదారి పడుతుంటారు. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో పిల్లలను సరైన దారిలోకి తీసుకురావచ్చు. ఆ వివరాలు...
పిల్లలు చెడు వైపునకు త్వరగా ఆకర్షితులవుతారు. కాబట్టి పిల్లల ప్రవర్తనను పరిశీలిస్తూ ఉండాలి. ఏమైనా తప్పులు చేస్తే వాటి గురించి వివరిస్తూ అర్థమయ్యేలా చెప్పాలి. మరల ఆ తప్పు చేయకుండా పిల్లలను మృదు స్వరంతో హెచ్చరించాలి.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై అనవసరమైన ఆంక్షలు విధిస్తూ ఆసక్తిలేని లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉంటారు. దీంతో పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకత తగ్గుతుంది. అలాకాకుండా పిల్లల ఇష్టాలను గమనించి ఆ రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే సరైన దారిలో విజయం సాధిస్తారు.
పిల్లలను స్నేహపూర్వక వాతావరణంలో పెంచాలి. వారి మనసులోని భావాలను నిర్భయంగా చెప్పనివ్వాలి. అప్పుడే పిల్లల వ్యక్తిత్వం, ఆలోచన విధానం గురించి తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఏమైనా తప్పులుంటే వెంటనే సరిదిద్దే వీలుంటుంది.
పిల్లలను తోబుట్టువులతోకానీ, తోటి పిల్లలతోకానీ పోల్చకూడదు. అలాచేస్తే పిల్లల్లో న్యూనత భావం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలకు బీజం పడుతుంది. పిల్లలు చక్కగా చదువుకుంటూ మంచి ప్రవర్తన అలవరచుకునేలా చూడాలి. మనసులో ఈర్ష్య, అసూయలకు తావీయకుండా స్నేహ భావం పెరిగేలా పిల్లలతో మాట్లాడాలి.
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన