రెండేళ్ల లోపు తీపి వద్దు
ABN , Publish Date - Aug 04 , 2026 | 03:22 AM
రెండేళ్ల లోపు పిల్లలకు తీపి తగ్గిస్తే, భవిష్యత్తులో డిమెన్షియా ముప్పు 23% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది....
కిడ్స్ కేర్
రెండేళ్ల లోపు పిల్లలకు తీపి తగ్గిస్తే, భవిష్యత్తులో డిమెన్షియా ముప్పు 23% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. చక్కెరకూ, మెదడు ఆరోగ్యానికీ ఉన్న అవినాభావ సంబంధం, ప్రభావాల గురించి తెలుసుకుందాం!
న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం, మెదడు మీద చక్కెర ప్రభావాన్ని నిర్థారించడం కోసం, ఒక చారిత్రాత్మక సహజ ప్రయోగాన్ని ప్రస్థావించింది. 1953లో ఇంగ్లండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, చక్కెర మీద విధించిన ఆంక్షల ప్రభావాలను పరిశోధకులు పరిశీలించారు. ఆంక్షను విరమించుకున్న తర్వాత, బ్రిటిష్ పౌరుల్లో సగటు రోజువారీ చక్కెర వినియోగం రాత్రికి రాత్రే రెండింతలకు పెరిగిపోయింది. యుకె బయోబ్యాంకు ద్వారా దాదాపు 65 వేల మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించడం కోసం యుద్ధకాలంలో చక్కెర ఆంక్షల మధ్య పెరిగిన పిల్లల ఆరోగ్య వివరాలను, ఆంక్షలు తొలగించిన తర్వాత పుట్టిన పిల్లల ఆరోగ్య వివరాలతో సరిపోల్చడం జరిగింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన రెండేళ్ల లోపు చక్కెరను పరిమితంగా తీసుకున్న వ్యక్తుల్లో డిమెన్షియా 2.6 సంవత్సరాలు ఆలస్యంగా మొదలైనట్టు ఈ విశ్లేషణలో వెల్లడైంది. కాబట్టి జీవితకాలపు మెదడు ఆరోగ్యం, పుట్టిన తొలి వెయ్యి రోజుల లోపు బిడ్డకు అందే చక్కెర మీద ఆధారపడి ఉంటుందని పరిశోధకులు నిర్థారించారు. గర్భిణులకూ, రెండేళ్ల లోపు పిల్లలకూ చక్కెరను సాధ్యమైనంత పరిమితం చేయడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..