Share News

ఐవి ఇంజెక్షన్‌ ఇక సులభం

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:28 AM

శిరకు ఇంజెక్షన్‌ ఇవ్వాలంటే, చేతిని నొక్కి పట్టి, శిరలను ఉబ్బించి, అవి స్పష్టంగా కనిపించిన తర్వాతే ఇంజెక్షన్‌ ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా...

ఐవి ఇంజెక్షన్‌ ఇక సులభం

సాంకేతికత

శిరకు ఇంజెక్షన్‌ ఇవ్వాలంటే, చేతిని నొక్కి పట్టి, శిరలను ఉబ్బించి, అవి స్పష్టంగా కనిపించిన తర్వాతే ఇంజెక్షన్‌ ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా శిరలు దొరకకపోవచ్చు. ఈ ఇబ్బందిని పరిష్కరించడం కోసం తాజాగా ఒక పరికరం అందుబాటులోకొచ్చింది. అదే... వెయిన్‌ విజువలైజేషన్‌ డివైజ్‌!

ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్‌ కోసం శిరను కచ్చితంగా కనిపెట్టాలి. కానీ కొందరి విషయంలో ఈ పని సంక్లిష్టంగా మారుతుంది. శిర ను కనిపెట్టడంలో ఉండే ఈ ఇబ్బందిని తొలగించడం కోసం తాజాగా ‘వెయిన్‌ విజువలైజేషన్‌ డివైజ్‌’ అందుబాటులోకొచ్చేసింది. దీని సహాయంతో శిరను సులభంగా, కచ్చితంగా కనిపెట్టే వీలుంటుంది. ఈ డివైజ్‌ అతినీలలోహిత వెలుగు సహాయంతో చర్మం అడుగున ఉన్న శిరలను స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. ఈ వెసులుబాటు వల్ల పదే పదే ప్రయత్నాలు విఫలమవకుండా, రోగులు అసౌకర్యానికి గురి కాకుండా సులభంగా, త్వరగా, కచ్చితంగా ఐవి ఇంజెక్షన్‌ను చొప్పించే వీలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలు, పెద్దల విషయంలో, అరుదుగా కొందర్లో శిరలను వెతికి పట్టడం చాలా కష్టం. ఇలాంటి సందర్భాల్లో తాజా వెయిన్‌ విజువలైజేషన్‌ డివైజ్‌ ఎంతో బాగా అక్కరకొస్తోంది.

ఇవి కూడా చదవండి..

క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించిన ఇరాన్..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 24 , 2026 | 02:28 AM