Share News

అరిగిన కీళ్లకు ఇంజెక్షన్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 02:52 AM

దెబ్బతిన్న కీళ్లను ఒకే ఒక ఇంజెక్షన్‌తో నయం చేసే వీలుందా? ఆ రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు పరిశోధకులు. మరిన్ని వివరాలు...

అరిగిన కీళ్లకు ఇంజెక్షన్‌

పరిశోధన

దెబ్బతిన్న కీళ్లను ఒకే ఒక ఇంజెక్షన్‌తో నయం చేసే వీలుందా? ఆ రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు పరిశోధకులు. మరిన్ని వివరాలు...

ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో అరిగిపోయిన, దెబ్బతిన్న కీళ్లను తిరిగి సరిదిద్దే వీల్లేదని ఇప్పటివరకూ నమ్ముతూ వచ్చాం. అయితే యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌ పరిశోధకులు అలాంటి కీళ్లను సరిదిద్దే ఒక అధునాతన ఔషథాన్ని అభివృద్ధి చేశారు. ఇంజెక్షన్‌తో మోకీళ్లలోకి ఇంజెక్ట్‌ చేసే ఈ మందు, దెబ్బతిన్న ప్రాంతంలోని మృదులాస్థి, ఎముక కణాలను ప్రేరేపించి, కొన్ని వారాల వ్యవధిలోనే కొత్త కణజాలాన్ని పునర్నిర్మిస్తుంది. ఆ ఇంజెక్షన్‌ అందుబాటులోకొస్తే, ఆస్టియోఆర్థ్రయిటిస్‌ను మరింత పెరగకుండా నియంత్రించడంతో పాటు, అరిగిన కీళ్లను సరిదిద్దే వీలు కలుగుతుంది. ప్రస్తుతం జంతువుల మీద చేపట్టిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలనిస్తున్న ఈ ఇంజెక్షన్‌ను మరో 18 నెలల్లో మనుషుల మీద కూడా ప్రయోగించబోతున్నారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలను సాధిస్తే, మోకీళ్ల అరుగుదలను నియంత్రించుకోవడంతో పాటు, మోకాలి మార్పిడితో పని లేకుండా కీళ్ల సమస్యలను శాశ్తంగా నివారించుకోవచ్చు.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 02:52 AM