Share News

కేశ సంరక్షణ ఇలా...

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:07 AM

ఎండాకాలంలో వేడి వల్ల తలలో విపరీతంగా చెమట పడుతుంటుంది. దీంతో మాడు మీద కురుపులు, దురద ఏర్పడుతుంటాయి...

కేశ సంరక్షణ ఇలా...

ఎండాకాలంలో వేడి వల్ల తలలో విపరీతంగా చెమట పడుతుంటుంది. దీంతో మాడు మీద కురుపులు, దురద ఏర్పడుతుంటాయి. వీటిని వేపాకులతో సులభంగా పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే...

  • కొన్ని వేపాకులను తేమ పోయేంతవరకు నీడలో ఆరబెట్టి మెత్తటి పొడిలా చేయాలి. గిన్నెలో నాలుగు చెంచాల వేప పొడి, చెంచా కొబ్బరినూనె వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పావు గంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి గుప్పెడు వేపాకులు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీళ్లను వడబోసి చేత్తో కొద్దికొద్దిగా తీసుకుంటూ శిరోజాలకు కుదుళ్లకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే మాడు మీద దురద మాయమవుతుంది. శిరోజాల బిరుసుదనం తగ్గుతుంది. కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం ఆగుతుంది.

  • రెండు గుప్పెళ్ల వేపాకులను మెత్తగా నూరి తలకు పట్టించాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో తలస్నానం చేస్తే తలలో కురుపులు, దురద వెంటనే తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 05:07 AM