Share News

మెరిసే చర్మం కోసం

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:19 AM

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ కెమికల్స్‌ ఉన్న క్రీములు వాడి చర్మాన్ని పాడుచేసుకోవడం కంటే మన వంటింట్లో దొరికే వస్తువులతో ‘న్యాచురల్‌ గ్లో’ పొందవచ్చు....

మెరిసే చర్మం కోసం

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ కెమికల్స్‌ ఉన్న క్రీములు వాడి చర్మాన్ని పాడుచేసుకోవడం కంటే మన వంటింట్లో దొరికే వస్తువులతో ‘న్యాచురల్‌ గ్లో’ పొందవచ్చు.

ముఖంపై మెరుపు కోసం: పాలు, శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు శనగపిండిలో పెరుగు కలిపి వాడవచ్చు.

కళ్ల కింద నలుపు: కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. దీనికి బంగాళదుంప రసం లేదా దోసకాయ ముక్కలను కళ్లపై 15 నిమిషాలపాటు ఉంచుకుంటే ఉపశమనం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ రాసుకుంటే కళ్లు తాజాగా కనిపిస్తాయి.

మృదువైన పెదవులు: పెదవులు నల్లబడకుండా, పగలకుండా ఉండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా నెయ్యి లేదా తేనె రాయండి. వారానికి ఒకసారి పంచదారతో మెల్లిగా స్క్రబ్‌ చేస్తే పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. గుర్తుంచుకోండి, రోజుకు కనీసం 8 గంటల నిద్ర, 3 లీటర్ల నీరు తాగడం వల్ల కలిగే గ్లో ఏ క్రీములూ ఇవ్వలేవు.

ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్

Updated Date - Mar 02 , 2026 | 05:19 AM