దోమలను తరమండిలా...
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:59 AM
వేసవి కాలంలో సాయంత్రం కాగానే గుంపులు గుంపులుగా దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. రాత్రంతా నిద్రాభంగం కలిగిస్తుంటాయి. అలాకాకుండా దోమలకు చెక్ పెట్టే చిట్కాలివే...
వేసవి కాలంలో సాయంత్రం కాగానే గుంపులు గుంపులుగా దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. రాత్రంతా నిద్రాభంగం కలిగిస్తుంటాయి. అలాకాకుండా దోమలకు చెక్ పెట్టే చిట్కాలివే...
నిమ్మకాయను మధ్యకు కోసి ఆ నిమ్మ చెక్కల్లో లవంగాలు గుచ్చాలి. వీటిని హాల్, పడకగది మూలల్లో ఉంచాలి. పావు గంటలో దోమలన్నీ బయటికి వెళ్లిపోతాయి.
ఇంట్లో ప్రతి గదిలో నాలుగు మూలలా రెండు కర్పూరం బిళ్లలు ఉంచాలి. వీటి ఘాటుకు దోమలన్నీ చనిపోతాయి.
సాయంత్రం కాగానే ఇంటి ముంగిట కొన్ని వేపాకులను కుప్పలా పోసి కాల్చాలి. వీటి నుంచి వచ్చే పొగ వల్ల దోమలు ఇంట్లోకి రాలేవు.
వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి ఆ ముద్దను ఒక గ్లాసు నీటిలో కలపాలి. అరగంట తరువాత ఆ నీటిని ఒక స్ర్పే బాటిల్‌లో పోసి ఇంట్లో స్ర్పే చేయాలి. ఆ వాసనకు దోమలన్నీ చనిపోతాయి.
లెమన్ గ్రాస్, లావెండర్, తులసి, బంతి లాంటి ఇండోర్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసుకున్నా ఇంట్లో దోమల బెడద తప్పుతుంది.
ఒక గ్లాసు నీటిలో నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా దాల్చిన చెక్క నూనెను వేసి బాగా కలపాలి. ఆపైన ఓ స్ర్పే బాటిల్‌లో పోసి ఇల్లంతా స్ర్పే చేయాలి. దీనివల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్
అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..