Share News

ఇంట్లో నెలకోసారి...

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:21 AM

ఇల్లు అద్దంలా మెరవాలంటే వస్తువులన్నీ శుభ్రంగా ఉండాలి. అందుకే వీటన్నింటినీ నెలకోసారి క్లీన్‌ చేస్తే సరి...

ఇంట్లో నెలకోసారి...

ఇల్లు అద్దంలా మెరవాలంటే వస్తువులన్నీ శుభ్రంగా ఉండాలి. అందుకే వీటన్నింటినీ నెలకోసారి క్లీన్‌ చేస్తే సరి...

  • ఇంట్లోని ట్యూబ్‌లైట్లు, బల్బులు, ఫ్యాన్‌లను దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా తుడవాలి. అప్పుడే ఇల్లు ప్రకాశవంతమైన వెలుగుతో నిండుతుంది. తాజాగా గాలి వీస్తుంది.

  • వంటగదిలో ఉండే చిమ్నీ, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌లమీద దుమ్ము, బూజు, జిడ్డు ఎక్కువగా పేరుకుంటూ ఉంటాయి. వీటిని సర్ఫ్‌ లేదా షాంపూ నీళ్లలో ముంచిన గుడ్డతో గట్టిగా తుడవాలి. రిపేర్లు ఏమైనా ఉంటే వెంటనే చేయించాలి. వంటగది క్లీనింగ్‌ మీద ప్రత్యేక శ్రద్ద పెడితే ఇంట్లో దుర్వాసన రాకుండా ఉంటుంది.

  • సోఫా, డైనింగ్‌ టేబుల్‌, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషిన్‌ కవర్లమీద; కిటికీలు, డోర్‌ కర్టెన్ల మీద ఎక్కువగా మట్టి చేరుతూ ఉంటుంది. వీటిని సర్ఫ్‌ నీళ్లలో నానబెట్టి వేడినీళ్లతో ఉతికితే చాలు. ఇల్లంతా తాజాగా అనిపిస్తుంది

  • ఫ్రిజ్‌లో అనవసరమైన పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. గోరువెచ్చటి నీటిలో ముంచిన పలుచని గుడ్డతో ఫ్రిజ్‌ లోపల, బయటా శుభ్రంగా తుడవాలి.

  • మైక్రో ఓవెన్‌ మీద నూనె, జిడ్డు మరకలు ఏర్పడుతుంటాయి. లోపల ఆహార పదార్థాలు పడుతుంటాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా క్లీన్‌ చేయాలి.

  • వ్యాక్యూమ్‌ క్లీనర్‌ సహాయంతో పరుపులు, దిండ్లు, కుషన్లు, సోఫాలను దుమ్ము లేకుండా శుభ్రం చేయాలి.

  • పాడైపోయిన కార్పెట్లు, డోర్‌మ్యాట్‌లను తొలగించి కొత్తవాటిని వేస్తే ఇల్లు నీట్‌గా కనిపిస్తుంది.

  • వాషింగ్‌ మెషిన్‌ డ్రమ్‌ను కూడా నిర్దేశిత పౌడర్‌ సహాయంతో శుభ్రం చేయాలి. బయటి భాగాల మీద ఎక్కుగా చేతి మరకలు, డిటర్జెంట్‌ మరకలు పడుతుంటాయి. వీటిమీద కొద్దిగా వెనిగర్‌ చిలకరించి పొడిగుడ్డతో తుడవాలి.

  • బాత్రూమ్‌ టైల్స్‌, పంపులు, కబోర్డుల మీద నీటి మరకలు, షాంపూ మరకలు పడుతుంటాయి. వీటిమీద బేకింగ్‌ సోడా పేస్టు అప్లయ్‌ చేసి వేడినీళ్లతో కడిగి పొడి గుడ్డతో తుడవాలి. అలాగే ఇంట్లో ఉండే సింక్‌లను శుభ్రం చేసి వాటి డ్రెయిన్‌లలో వేడినీళ్లు పోయాలి.

ఇవీ చదవండి:

ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..

జీడీపీకి చమురు సెగ

Updated Date - Mar 05 , 2026 | 04:21 AM