వర్షాల్లో మొక్కల కోసం...
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:45 AM
వర్షాకాలంలో మొక్కల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
వర్షాకాలంలో మొక్కల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
వర్షం పడిన రోజు మట్టిలో అధికంగా నీరు చేరుతుంటుంది. కాబట్టి రెండు లేదా మూడు రోజుల వరకు మొక్కలకు నీటిని పోయకూడదు. మట్టిలో నీటి నిల్వ పెరిగితే వేళ్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోతాయి.
కుండీలను కొద్దిగా వంచి అదనంగా నిండిన వర్షపు నీటిని తొలగించాలి. కుండీలకు కింది భాగంలో రంధ్రాలనుంచి నీరు బయటికి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మట్టి తడారినప్పుడు మాత్రమే కుండీల్లో కొద్దిగా నీటిని చిలకరిస్తే సరిపోతుంది.
వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరిగినప్పుడు మొక్కల కాండాలమీద, ఆకులపైన బూజులు ఏర్పడవచ్చు. అలాంటి బూజు తెగులు కనిపించినప్పుడు మొక్కలపై కొద్దిగా వేప నూనెను పిచికారీ చేయాలి. ఇది సహజ శిలీంధ్ర సంహారిణిలా పనిచేసి ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి.
ఎక్కువగా పూలు పూయాలనో, కాయలు కాయాలనో మొక్కలకు అధికంగా ఎరువులు వేయకూడదు. అవసరం మేరకు సేంద్రీయ ఎరువులు లేదా వర్మీ కంపోస్టును మితంగా వాడాలి.
వారానికి ఒకసారి మొక్కల కాండాలను, ఆకులను తనిఖీ చేస్తుండాలి. వాటిపై ఏవైనా పురుగులు, మచ్చలు, రంధ్రాలు లాంటివి కనిపిస్తే ఆ భాగాలను వెంటనే కత్తిరించి అవసరమైన సస్య రక్షణ చర్యలు చేపట్టాలి.
మట్టిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి లేదా పసుపు కలిపితే వేళ్ల వద్ద పురుగులు చేరవు. మొక్కల చుట్టూ మట్టిలో కొద్దిగా ఆవుపేడ కలిపిన నీటిని పోస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
రోజూ మొక్కలకు కొద్దిసేపు ఎండ తగిలేలా చూడాలి. ఇండోర్ ప్లాంట్స్ కుండీలను కూడా కాసేపు ఎండలో ఉంచడం మంచిది.
చుట్టూ పెరిగే కలుపు మొక్కలను తీసివేయాలి. కొత్త చిగుళ్లు వచ్చేందుకు వీలుగా ఎండిన ఆకులు, కొమ్మలను అలాగే అదనంగా పెరిగిన భాగాలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి. అప్పుడే మొక్కలు పచ్చగా గుబురుగా తయారవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు
జులై మూడో వారంలో తల్లికి వందనం!
Read Latest Telangana News And Telugu News