Share News

వానల్లో ఇవి తీసుకోవాలి...

ABN , Publish Date - Aug 09 , 2026 | 03:32 AM

వానాకాలంలో తరచూ ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జీర్ణ సమస్యలనుంచి బయటపడాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...

వానల్లో ఇవి తీసుకోవాలి...

వానాకాలంలో తరచూ ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జీర్ణ సమస్యలనుంచి బయటపడాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...

  • టమాటా, కేరట్‌, బీన్స్‌, గుమ్మడికాయ ముక్కలతో తయారుచేసిన సూప్‌ను వేడివేడిగా తాగాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజలవణాలు తదితర పోషకాలు అందుతాయి. తక్షణ శక్తి లభిస్తుంది. శరీరం తేమను కోల్పోకుండా ఉంటుంది.

  • బియ్యం, పెసరపప్పు లేదా కంది పప్పు, కూరగాయల ముక్కలతో తయారుచేసే కిచిడీని తినడం మంచిది. ఇది త్వరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచులు అంది జీర్ణాశయ సమస్యలు రావు. మలబద్దకం ఏర్పడదు. రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది

  • ఉదయం పూట రాగి జావను అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇందులో మజ్జిగ లేదంటే పాలు, బెల్లం కలుపుకుని తీసుకుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్‌, పీచులు పుష్కలంగా అందుతాయి.

  • వేడి వేడి సాంబార్‌తో ఇడ్లీ, ఓట్స్‌ ఉప్మా, అటుకుల ఉప్మాలాంటివి తిన్నా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో కూరగాయల ముక్కలు చేర్చుకుంటే నీరసం తగ్గుతుంది.

  • జలుబు, దగ్గు వేధిస్తుంటే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు, అర చెంచా మిరియాల పొడి కలుపుకుని తాగితే ఉపశమనంగా ఉంటుంది.

  • అప్పటికప్పుడు వండిన వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉన్నవాటిని తినకూడదు. చల్లని పానీయాలు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌లను మానేయాలి. తరచూ మంచినీటిని తాగుతూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రిస్తే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 03:32 AM