మనీ ప్లాంట్ ఏపుగా
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:23 AM
ఎండాకాలంలో మనీప్లాంట్ ఏపుగా పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటంటే...
ఎండాకాలంలో మనీప్లాంట్ ఏపుగా పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటంటే...
ఈ మొక్కకు నేరుగా సూర్యరశ్మి సోకితే ఆకులు త్వరగా వాడిపోతాయి. అందుకే మొక్కకు నీడ తగిలేలా ఏర్పాటు చేసుకోవాలి.
దీనికి నీళ్లు ఎక్కువగా పోయకూడదు. మట్టి తేమగా ఉంటే చాలు. అప్పుడప్పుడు ఆకుల మీద కొన్ని నీళ్లు స్ర్పే చేస్తూ ఉండాలి.
వేసవిలో కుండీని హాల్, లివింగ్ రూమ్, బెడ్ రూమ్‌లలో పెట్టుకోవడం మంచిది. బాల్కనీలో పెడితే మాత్రం నీడ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
కుండీని మాటిమాటికీ కదపకూడదు. స్థిరంగా ఒకచోట ఉంచితేనే ఆకులు బలంగా పెరుగుతాయి.
ఎండిన ఆకులు, కాడలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. అప్పుడే కాండం పొడవుగా పెరుగుతుంది. ఆకులు పెద్దగా గుబురుగా వస్తాయి.
మనీ ప్లాంట్‌ను మట్టిలో పెంచుతున్నట్లయితే నెలకోసారి మట్టిలో వర్మీ కంపోస్ట్ లేదా కోకోపీట్, సేంద్రీయ ఎరువులు కలపాలి. అదే నీళ్లలో పెంచుతున్నట్లయితే వారానికోసారి నీళ్లు మారుస్తూ ఉండాలి.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..