Share News

కళ తెచ్చే సీలింగ్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:36 AM

ఇల్లు అందంగా కనిపించాలంటే గదుల ‘సీలింగ్స్‌’ ప్రత్యేకంగా ఉండాలంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఇంటికి రాయల్‌ లుక్‌ని తెచ్చే సరికొత్త సీలింగ్‌ డిజైన్లు....

కళ తెచ్చే సీలింగ్‌

ఇల్లు అందంగా కనిపించాలంటే గదుల ‘సీలింగ్స్‌’ ప్రత్యేకంగా ఉండాలంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఇంటికి రాయల్‌ లుక్‌ని తెచ్చే సరికొత్త సీలింగ్‌ డిజైన్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

  • సాఫ్ట్‌ కోవ్‌ లైటింగ్‌తో కూడిన ఫాల్స్‌ సీలింగ్‌.. ఇంటిని అందంగా మెరిపిస్తుంది. ఉడెన్‌ ప్యానెల్‌, మినిమల్‌ పీఓపీ, బ్యాక్‌లిట్‌, లేయర్డ్‌ సీలింగ్‌ లాంటి రకాలకు కూడా డిమాండ్‌ అధికంగా ఉంటోంది. పై కప్పు ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ ఇవి ఇంటిని హుందాగా మార్చేస్తాయి.

  • మరీ ముదురు రంగులు కాకుండా గోధుమ రంగు షేడ్స్‌, బూడిద వర్ణం, ఇతర లేత రంగుల డిజైన్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

  • తక్కువ కాంతిని ఇచ్చే లైట్లు అమర్చిన సింగిల్‌ లేయర్‌ పెయింటింగ్‌ డిజైన్లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఇంటికి పాజిటివ్‌ వైబ్స్‌ను తీసుకొస్తాయి.

  • పడక గది కోసం సింపుల్‌ సీలింగ్‌ డిజైన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. దీనివల్ల గది విశాలంగా కనిపించడంతోపాటు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది కూడా.

  • ఎండీఎఫ్‌ ప్యానెల్స్‌తో కూడిన 3డీ డిజైన్లు, మెటాలిక్‌ ఫినిషింగ్‌ డిజైన్లు... ఇంటికి మోడరన్‌ లుక్‌ని అందిస్తాయి.

  • ఎల్‌ఈడీ బల్బులతో కూడిన జ్యామితీ డిజైన్లు.. లివింగ్‌ రూమ్‌ అందాన్ని పెంచుతాయి.

  • సౌండ్‌ ప్రూఫ్‌తో రూపొందించిన అకౌస్టిక్‌ సస్పెండెడ్‌ సీలింగ్‌... ఆఫీస్‌ రూమ్‌ ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

  • వంటగది, బాత్రూమ్‌లకు పీవీసీ సీలింగ్‌ అనువుగా ఉంటుంది. ఇది తేమ నిరోధకంగా పనిచేస్తుంది కూడా.

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 05:37 AM