Share News

వస్త్రాల్లో మైక్రోప్లాస్టిక్స్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:46 AM

ముడి చమురు, కరిగించిన ప్లాస్టిక్‌ సీసాలు, సింథటిక్‌ రసాయనాలతో పాలియస్టర్‌ వస్త్రం తయారవుతుంది. కాబట్టి ఈ వస్త్రంతో రూపొందిన దుస్తులు వేసుకున్న ప్రతిసారీ, మైక్రోప్లాస్టిక్‌ ఫైబర్లు నేరుగా చర్మం పైన...

వస్త్రాల్లో  మైక్రోప్లాస్టిక్స్‌

మనలో చాలామంది పాలియస్టర్‌తో తయారైన దుస్తులు వేసుకుంటూ, వీటిని సాధారణ వస్త్రాలుగానే భావిస్తూ ఉంటాం. కానీ వీటిలో హానికారక మైక్రోప్లాస్టిక్స్‌ ఉంటాయని మీకు తెలుసా?

ముడి చమురు, కరిగించిన ప్లాస్టిక్‌ సీసాలు, సింథటిక్‌ రసాయనాలతో పాలియస్టర్‌ వస్త్రం తయారవుతుంది. కాబట్టి ఈ వస్త్రంతో రూపొందిన దుస్తులు వేసుకున్న ప్రతిసారీ, మైక్రోప్లాస్టిక్‌ ఫైబర్లు నేరుగా చర్మం పైన రాలిపడుతూ ఉంటాయి. ఈ పార్టికల్స్‌లో హార్మోన్లను అస్తవ్యస్థం చేసే బిపిఎ, థాలేట్స్‌, యాంటిమొనీ మొదలైన రసాయనాలుంటాయి. ఇవి రక్తప్రసరణలోకి చేరుకుంటూ, మెదడు, పునరుత్పత్తి కణజాలాల్లో పేరుకుంటూ ఉంటాయి. ఈ పరిస్థితి పునరుత్పత్తి సమస్యలతో పాటు, హార్మోన్ల అసమతౌల్యాలకూ, క్యాన్సర్‌కూ దారి తీస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. వ్యాయామం సమయంలో వేసుకునే పాలియస్టర్‌ స్పోర్ట్స్‌ బ్రాసరీలలో, బిపిఎ మోతాదులు 22 శాతం మేరకు ఉంటాయని పరీక్షల్లో తేలింది. అత్యంత రక్షణ అవసరమైన రొమ్ము కణజాలం ఈ రకమైన బ్రాసరీలకు బహిర్గతమవడం ప్రమాదకరం. పైగా వ్యాయామ సమయంలో విడుదలయ్యే చమట, వేడి వల్ల మరిన్ని మైక్రోప్లాస్టిక్స్‌ విడుదలై, మరిన్ని విషపూరిత రసాయనాలు మన రక్తంలోకి చేరుకుంటూ ఉంటాయి.

కాబట్టి పాలియస్టర్‌ దుస్తులకు దూరంగా ఉండడంతో పాటు కాటన్‌, లినెన్‌, హెంప్‌ లేదా వెదురుతో తయారైన దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే దుస్తుల లేబుళ్ల మీద... ఎలాస్టేన్‌, స్పాండెక్స్‌ లేదా మాయిశ్చర్‌ విక్కింగ్‌ అని పేర్కొని ఉన్న దుస్తుల జోలికి వెళ్లకండి.

ఈ వార్తలు కూడా చదవండి

మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ.. తీర్పు వాయిదా వేసిన కోర్టు

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

Updated Date - Apr 07 , 2026 | 03:46 AM