Share News

బెండకాయ జిగురుతో ఇబ్బందా

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:32 AM

బెండకాయలను కోసేటప్పుడు, వండేటప్పుడు వాటిలోని జిగురు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్యను తొలగించే చిన్న చిట్కాలివే...

బెండకాయ జిగురుతో ఇబ్బందా

బెండకాయలను కోసేటప్పుడు, వండేటప్పుడు వాటిలోని జిగురు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్యను తొలగించే చిన్న చిట్కాలివే...

  • బెండకాయలకు తడి తగిలితే వాటిలో జిగురు పెరుగుతుంది. కాబట్టి వండడానికి గంట ముందే వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఇంకా తడి ఉన్నట్లయితే పలుచని గుడ్డతో తుడిచి ఆపైన ముక్కలు కోయాలి.

  • బెండకాయలను కోసేముందు చాకుకు రెండువైపులా కొద్దిగా నిమ్మరసం లేదా నూనెను రాస్తే జిగురు ఎక్కువగా రాదు. ముక్కలు కూడా ఒకదానికొకటి అంటుకోవు.

  • బెండకాయలను వండేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు లేదా చింతపండు రసం వేస్తే జిగురు రాకుండా ఉంటుంది. ముక్కలు విడివిడిగా ఉంటూ త్వరగా మగ్గుతాయి. కూరలో నిమ్మరసం చిలకరించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • బెండకాయలతో కూర లేదా వేపుడు చేసేటప్పుడు గిన్నెపై మూత పెట్టకూడదు. అలా పెడితే గిన్నెలో నీటి ఆవిరి ఏర్పడి ముక్కలను మెత్తగా జిగురుగా మార్చేస్తుంది. కాబట్టి మూత లేకుండా మధ్యస్థ మంటపై వండితే కూర లేదా వేపుడు త్వరగా తయారవుతుంది.

  • బెండకాయలను వండేటప్పుడు ముందుగానే ఉప్పు వేయకూడదు. అలావేస్తే ముక్కల నుంచి నీరు విడుదలై కూర మొత్తం జిగురుగా తయారవుతుంది. ముక్కలు ముప్పావు వంతుకు పైగా మగ్గిన తరువాతనే అందులో ఉప్పు, కారం వేస్తే కూర పొడి పొడిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 04:32 AM