Share News

గ్లాస్‌ స్కిన్‌ కోసం

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:35 AM

చర్మం తేమతో నిండి బిగుతుగా చక్కగా నిగారిస్తూ ఉండాలని అమ్మాయిలంతా కోరుకుంటూ ఉంటారు. అలాంటి గ్లాస్‌ స్కిన్‌ కోసం కొరియన్‌ టిప్స్‌ ఇవే...

గ్లాస్‌ స్కిన్‌ కోసం

చర్మం తేమతో నిండి బిగుతుగా చక్కగా నిగారిస్తూ ఉండాలని అమ్మాయిలంతా కోరుకుంటూ ఉంటారు. అలాంటి గ్లాస్‌ స్కిన్‌ కోసం కొరియన్‌ టిప్స్‌ ఇవే...

  • ముఖాన్ని ముందుగా ఆయిల్‌ క్లెన్సర్‌తో తరువాత ఫోమ్‌ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. డబుల్‌ క్లెన్సింగ్‌ చేయడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రమై ముఖానికి చక్కని మెరుపుదనం చేకూరుతుంది.

  • మూడు రోజులకోసారి ముఖానికి ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌ బాధ తగ్గుతుంది. చర్మం నున్నగా మారి ముఖం కాంతివంతమవుతుంది.

  • ముఖానికి టోనర్‌ అప్లయ్‌ చేస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం పీహెచ్‌ స్థిరంగా ఉంటుంది. ముఖం ఛాయగా కనిపిస్తుంది.

  • సి విటమిన్‌ లేదా హైలూరోనిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉన్న సీరమ్‌లను తరచూ ముఖానికి అప్లయ్‌ చేస్తూ ఉండాలి. వీటివల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది.

  • అవసరం మేరకు ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లయ్‌ చేస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా తేమతో నిండి ముఖం కళగా కనిపిస్తుంది.

  • రెండు రోజులకోసారి ముఖానికి ఫేస్‌ ప్యాక్‌ అప్లయ్‌ చేయాలి. చర్మ తత్వానికి సరిపడే ప్యాక్‌ను ఎంపిక చేసుకుంటే జిడ్డు, మురికి తొలగి ముఖ వర్చస్సు పెరుగుతుంది.

  • కళ్ల చుట్టూ ఐ క్రీమ్‌ను రాసుకుంటూ ఉండాలి. ఇది కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను పూర్తిగా తొలగిస్తుంది. దీంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

  • బయటికి వెళ్లేముందు ముఖానికి సన్‌స్ర్కీన్‌ రాసుకోవాలి. దీనివల్ల ఎండ నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. ముఖంపై ట్యానింగ్‌ ఏర్పడదు. చర్మం సహజంగా మెరుస్తూ కాంతులీనుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 05:36 AM