పెనం కొత్తగా ఇలా...
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:34 AM
ఇంట్లో పెనంపై దోశలు, చపాతీలు చేస్తూ ఉంటాం. కొన్ని రోజుల తరువాత పెనం నల్లగా మాడిపోయి చుట్టూ జిడ్డు పేరుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో...
ఇంట్లో పెనంపై దోశలు, చపాతీలు చేస్తూ ఉంటాం. కొన్ని రోజుల తరువాత పెనం నల్లగా మాడిపోయి చుట్టూ జిడ్డు పేరుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో పెనాన్ని కొత్తదానిలా మార్చవచ్చు.
చిన్న గిన్నెలో కొద్దిగా మెత్తటి ఉప్పును తీసుకోవాలి. ఓ నిమ్మ చెక్కతో ఆ ఉప్పును అద్ది దానితో పెనాన్ని రుద్ది కడిగితే చాలు. జిడ్డు వదిలిపోయి పెనం శుభ్రపడుతుంది.
చిన్న గిన్నెలో చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల వెనిగర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని పెనంపై రాసి పావుగంటసేపు నాననివ్వాలి. తరువాత పలుచని గుడ్డతో తుడిచేస్తే పెనం కొత్తదానిలా మెరుస్తుంది.
పెనాన్ని శుభ్రం చేసేముందు దాన్ని స్టవ్‌మీద ఉంచి కొద్దిగా వేడిచేయాలి. తరువాత టిష్యూ పేపర్‌తో తుడిచేస్తే నూనె జిడ్డు తొలగిపోతుంది. తరువాత లిక్విడ్ డిటర్జెంట్ వేసి మెత్తటి స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే సరిపోతుంది.
గోరువెచ్చటి నీటిలో కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి కలపాలి. ఈ నీళ్లను పెనం మీద పోసి పది నిమిషాలపాటు ఉంచాలి. ఆపైన స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే మాడిన మరకలు తొలగి పెనం పూర్తిగా శుభ్రపడుతుంది.
పెనాన్ని వేడిచేసి దాని మీద కొద్దిగా షాంపూ, చెంచా వంటసోడా, కొద్దిగా టూత్‌పేస్ట్ వేసి కొన్ని నీళ్లు చిలకరించి కలుపుతూ పెనమంతా పరచాలి. పావు గంట తరువాత పాత టూత్‌బ్రష్ లేదా మెత్తటి స్క్రబ్బర్‌తో మెల్లగా రుద్దాలి. ఆపైన నీళ్లు పోసి కడగాలి. అంతే పెనం కొత్తదానిలా మారిపోతుంది.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..