Share News

ఇండక్షన్‌ స్టవ్‌తో జాగ్రత్త..!

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:25 AM

గ్యాస్‌ స్టవ్‌లకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్‌ స్టవ్‌ల వాడకం పెరుగుతోంది. వీటితో వంట త్వరగా పూర్తవుతుంది. ఇవి పర్యావరణహితంగా ఉంటాయి. కానీ...

ఇండక్షన్‌ స్టవ్‌తో జాగ్రత్త..!

గ్యాస్‌ స్టవ్‌లకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్‌ స్టవ్‌ల వాడకం పెరుగుతోంది. వీటితో వంట త్వరగా పూర్తవుతుంది. ఇవి పర్యావరణహితంగా ఉంటాయి. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

  • ఇండక్షన్‌ స్టవ్‌.. అయస్కాంత శక్తి ఆధారంగా పనిచేస్తుంది. దీని మీద అన్ని రకాల పాత్రలను ఉంచి వంటచేయడం సాధ్యం కాదు. ఇనప పాత్రలు లేదా స్టీల్‌ గిన్నెలను మాత్రమే వంటకు ఉపయోగించాలి. వీటి అడుగు భాగం చదునుగా ఉండాలి. రాగి, అల్యూమినియం, గాజు, మట్టి పాత్రల్లో వంట సాధ్యం కాదు.

  • ఇండక్షన్‌ స్టవ్‌ కోసం నాణ్యమైన సాకెట్‌ ప్లగ్‌ పాయింట్‌ను ఉపయోగించాలి. లేదంటే విద్యుత్‌ ఎక్కువగా వినియోగమవుతుంది. స్టవ్‌ లోపల, కంట్రోల్‌ ప్యానెల్‌ మీద నీళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • స్టవ్‌ మీద ముందుగా గిన్నె పెట్టి ఆ తరువాతనే స్టవ్‌ ఆన్‌ చేయాలి. వంట మొదలుపెట్టేటప్పుడు తక్కువ ఉష్ణోగ్రతను సెట్‌ చేసుకుని అవసరాన్ని బట్టి పెంచుకోవాలి.

  • స్టవ్‌ వెనక కింది భాగంలో ఫ్యాన్‌ ఉంటుంది. ఇది స్టవ్‌ను చల్లబరుస్తూ ఉంటుంది. ఈ ఫ్యాన్‌కు అడ్డంగా ఏ ఇతర వస్తువులు పెట్టకూడదు. స్టవ్‌ను ఆఫ్‌ చేసిన తరువాత కూడా లోపల ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంటుంది. అది ఆగిపోయే వరకు ప్లగ్‌ తీయకూడదు.

  • స్టవ్‌ మొత్తం గ్లాస్‌తో తయారై ఉంటుంది. దీనిమీద గిన్నెలు ఉంచేటప్పుడు, దించేటప్పుడు జాగ్రత్త వహించాలి.

  • వంట పూర్తయిన వెంటనే స్టవ్‌ను శుభ్రం చేసే ప్రయత్నం చేయకూడదు. వేడి పూర్తిగా తగ్గిన తర్వాతే గుడ్డతో సున్నితంగా తుడవాలి.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..

మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Mar 16 , 2026 | 12:25 AM