జీన్స్‌ను ఎలా ఉతకాలి..?
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:56 AM
జీన్స్‌వేర్‌ను రంగు, నాణ్యత దెబ్బతినకుండా ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం...
జీన్స్‌వేర్‌ను రంగు, నాణ్యత దెబ్బతినకుండా ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం.
జీన్స్ ప్యాంట్లు దృఢంగా ఉంటాయని ఎలా అంటే అలా పదే పదే ఉతకకూడదు. అలా చేస్తే వాటి రంగు వెలిసిపోతుంది. అవి ఫిట్‌గా ఉండకుండా వదులుగా మారిపోతాయి.
జీన్స్‌ను ఉతికేటప్పుడు దాన్ని లోపలివైపునకు తిప్పాలి. ఇలా చేయడంవల్ల డిటర్జెంట్ నేరుగా తగలదు కాబట్టి ప్యాంట్ రంగు వెలవదు.
జీన్స్‌ను చల్లటి లేదా గోరువెచ్చటి నీటితో మాత్రమే ఉతకాలి. తేలికపాటి డిటర్జెంట్‌ను వాడాలి. వేడినీటితో ఉతికినా, అధిక రసాయనాలు ఉన్న సబ్బు లేదా సర్ఫ్ వాడినా గరుకుగా మారి దాని మన్నిక దెబ్బతింటుంది.
జీన్స్‌ను ఉతికిన తరువాత నేరుగా ఎండలో ఆరేయకూడదు. సూర్యరశ్మి తగిలితే ప్యాంట్ రంగు వెలిసిపోతుంది. గాలి బాగా తగిలేలా నీడలో ఆరేస్తే సరిపోతుంది.
జీన్స్‌ను ఉతకడమనేది... వాటిని ఎన్నిసార్లు ఎంత సమయం మేరకు ధరించారు, వాతావరణం ఎలా ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!