కేరట్లు తాజాగా
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:29 AM
కేరట్లు త్వరగా తేమను కోల్పోయి వడలిపోతూ ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ అంతగా ఫలితం కనిపించదు. కానీ...
కేరట్లు త్వరగా తేమను కోల్పోయి వడలిపోతూ ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ అంతగా ఫలితం కనిపించదు. కానీ చిన్న చిట్కాలతో కేరట్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చేయవచ్చు.
కేరట్లకు తొక్క తీసి శుభ్రంగా కడిగి వాటిని గాలి చొరబడని వెడల్పాటి కంటైనర్‌లో ఉంచాలి. అవి మునిగేవరకు మంచినీటిని పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. నాలుగు రోజులకోసారి నీళ్లు మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే కొన్ని వారాలపాటు కేరట్లు గట్టిగా తాజాగా ఉంటాయి.
కేరట్లకు తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆపైన న్యూస్ పేపర్ లేదా పేపర్ టవల్‌లో చుట్టి జిప్‌లాక్ కవర్లో భద్రపరచి ఫ్రిజ్‌లో ఉంచితే నెల రోజుల వరకు కేరట్లు తాజాగా ఉంటాయి. వారానికోసారి పేపర్లు మార్చడం మర్చిపోకూడదు.
కేరట్లను పెద్ద సైజు ముక్కలుగా కోసి వేడినీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. తరువాత వాటిని చల్లటి నీటిలో ముంచి పొడిగా ఆరబెట్టాలి. ఆపైన వీటిని ఫ్రీజర్ బ్యాగ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
కేరట్లను యాపిల్, అరటిపండ్లు, బంగాళదుంపలనుంచి దూరంగా ఉంచితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
గట్టిగా, ఎర్రగా, ప్రకాశవంతంగా ఉండే కేరట్లను మాత్రమే కొనుగోలు చేయాలి. వీటికి పైన ఉండే ఆకుపచ్చని భాగాలను చాకుతో కోసి తొలగించాలి. దీనివల్ల కేరట్లు తేమను కోల్పోకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ