మాడు పొడిబారకుండా
ABN , Publish Date - May 20 , 2026 | 05:15 AM
తగినంత తేమ అందకపోవడం, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల మాడుమీద చర్మం పొడిబారి చుండ్రు, దురద, శిరోజాలు రాలడం లాంటి సమస్యలు ఏర్పడతాయి....
తగినంత తేమ అందకపోవడం, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల మాడుమీద చర్మం పొడిబారి చుండ్రు, దురద, శిరోజాలు రాలడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అలాకాకుండా మాడు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరి...
పెరుగు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కాబట్టి రెండురోజులకోసారి మాడుకు పెరుగును పట్టించి చల్లటి నీటితో తలస్నానం చేస్తే సమస్య తీరుతుంది.
చిన్న గిన్నెలో అయిదు చెంచాల కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని గోరువెచ్చగా వేడి చేయాలి. దీనితో మాడుమీద మర్దన చేసుకుంటే రక్తప్రసరణ జరిగి చర్మం మృదువుగా మారుతుంది. జుట్టు కుదుళ్లు బలోపేతమవుతాయి.
బాగా పండిన అరటిపండు గుజ్జును మాడుమీద రాసి అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మాడుకు తేమ అందుతుంది.
రాత్రి పడుకునేముందు తలకు టీ ట్రీ ఆయిల్, జోజోబా ఆయిల్, రోజ్‌మేరీ ఆయిల్‌లలో ఒకదానితో మర్దన చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
తలస్నానానికి వేడినీటిని ఉపయోగించకూడదు. మైల్డ్ షాంపూలను మాత్రమే వాడాలి. పోషకాహారం తీసుకుంటూ తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడే మాడుమీద చర్మం తేమతో నిండి మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్