Share News

నీరసంగా ఉంటోందా..?

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:26 AM

పోషకాహార లోపం, నిద్రలేమి, అనారోగ్య సమస్యల వల్ల ఆవహించే నీరసాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం...

నీరసంగా ఉంటోందా..?

పోషకాహార లోపం, నిద్రలేమి, అనారోగ్య సమస్యల వల్ల ఆవహించే నీరసాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం...

  • ఉదయం పూట అల్పాహారాన్ని మానకూడదు. దీనివల్లనే రోజంతటికీ కావాల్సిన శక్తి, ఉత్సాహం సమకూరుతాయి. రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోతే ఉదయాన్నే అలసటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు అల్పాహారంగా ఓట్‌మీల్‌, నట్స్‌, మొలకలు, సలాడ్స్‌, తాజా పండ్లను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. నిస్సత్తువ తగ్గుతుంది.

  • రక్తహీనత వల్లకూడా ఈ సమస్య తలెత్తవచ్చు. ఎర్ర రక్తకణాల వృద్ధి కోసం ఐరన్‌ ఎక్కువగా లభించే ఆకుకూరలు, కూరగాయలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. నిమ్మకాయ, నారింజ, టమాటాలను తీసుకోవడం వల్ల చాలావరకు సమస్య తీరుతుంది

  • కోడిగుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు, పప్పు ధాన్యాలను భోజనంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అంది నీరసం తగ్గుతుంది. ఓట్స్‌, బ్రౌన్‌ బ్రెడ్‌, చిరుధాన్యాలను తీసుకుంటుంటే అలసట దరిచేరదు.

  • శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. దాహం అనిపించకపోయినా గంటకోసారి మంచినీటిని తాగాలి. పండ్ల రసాలు, పలుచని మజ్జిగ, రాగి జావ, కొబ్బరి నీళ్లు తాగుతుంటే ఉపశమనంగా అనిపిస్తుంది.

  • నీరసంగా అనిపించినప్పుడు చేస్తున్న పనికి విరామం ఇచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది.

  • ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్‌, యోగ, ధ్యానం చేస్తుంటే శరీరం ఉత్సాహంగా మారుతుంది. తేలికపాటి వ్యాయామాలు కూడా మంచి ఫలితాన్నిస్తాయి.

  • కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌, స్వీట్లు, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాలి. రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రించాలి.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 04:26 AM