Share News

ఇల్లు గుబాళించేలా

ABN , Publish Date - May 20 , 2026 | 05:11 AM

ఇంట్లో ఎలాంటి దుర్వాసనలు లేకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

ఇల్లు గుబాళించేలా

ఇంట్లో ఎలాంటి దుర్వాసనలు లేకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

  • ఉదయం నిద్ర లేవగానే కిటికీలు, ఇంటి తలుపులు తెరవాలి. వెంటనే ఇంట్లో ఉన్న వేడిగాలి బయటికి వెళ్లి చల్లటి గాలి లోపలికి వస్తుంది. సూర్య కిరణాలు కూడా లోపలికి ప్రసరించ డంతో క్షణాల్లో ఇల్లంతా తాజాదనం నిండుతుంది.

  • లావెండర్‌, యూకలిప్టస్‌, నిమ్మకాయ వాసనలతో కూడిన డిఫ్యూజర్లు వాడితే ఇల్లంతా సువాసనలు నిండుతాయి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • బేకింగ్‌ సోడా, ఉప్పు కలిపిన నీటితో రోజూ ఇల్లంతా తుడుస్తుంటే ఎలాంటి దుర్వాసన అయినా మాయమవుతుంది. సోఫా, కార్పెట్లపైన కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లి వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.

  • వెడల్పాటి గిన్నెలో వేడినీళ్లు పోసి అందులో నారింజ తొక్కలు, నిమ్మ తొక్కలు, తులసి ఆకులు, లవంగాలు, దాల్చినచెక్క, కర్పూరం లాంటివి వేసి ఇంట్లో ఓ మూలగా ఉంచితే ప్రతి గదిలోకి తాజాదనం వ్యాపిస్తుంది. ఈ నీటిని రోజూ మారుస్తుండాలి.

  • లావెండర్‌, రోజ్‌మేరీ, మింట్‌ లాంటి సువాసనలు వెదజల్లే ఇండోర్‌ ప్లాంట్స్‌ ను ప్రతి గదిలో ఏర్పాటు చేసుకున్నా తాజా అనుభూతి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి..

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Updated Date - May 20 , 2026 | 05:11 AM