ఏసీ ఆపినా కూడా...
ABN , Publish Date - May 20 , 2026 | 05:09 AM
ఏసీని ఆపేసిన తరువాత కూడా గదిని రెండు గంటలపాటు చల్లగా ఉంచుకోవచ్చు. ఎలాగంటే...
ఏసీని ఆపేసిన తరువాత కూడా గదిని రెండు గంటలపాటు చల్లగా ఉంచుకోవచ్చు. ఎలాగంటే...
ఏసీని 16 నుంచి 18 డిగ్రీల వద్ద సెట్ చేసి పావుగంట తరువాత ఆపేస్తే గదిలోని గాలి మాత్రమే చల్లబడుతుంది. బెడ్, గది గోడలు, ఫ్లోర్, ఫర్నిచర్ వేడిగానే ఉంటాయి. వీటినుంచి వెలువడే వేడివల్ల గది వేడెక్కుతుంది. అలాకాకుండా ఏసీని 24 నుంచి 27 డిగ్రీల వద్ద సెట్‌చేసి గంటసేపు ఉంచితే గది నెమ్మదిగా చల్లబడుతుంది. తరువాత ఏసీని ఆపేసి ఫ్యాన్ వేసుకుంటే ఆ చల్లదనం రెండు గంటలు ఉంటుంది.
గదిలో చల్లదనం నిలిచి ఉండడానికి కిటికీలు, తలుపుల కింద సందుల దగ్గర మందపాటి దుప్పట్లను అడ్డుగా ఉంచాలి. అద్దాల కిటికీలకు మందపాటి కర్టెన్లు వేస్తే ఎండ లోపలికి ప్రసరించలేదు కాబట్టి గది వేడెక్కకుండా ఎక్కువసేపు చల్లగా ఉంటుంది.
గదిలో ఏసీ వేసినప్పుడు తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్‌ని కూడా వేసి ఉంచితే గది నలుమూలలకూ చల్లదనం వ్యాపిస్తుంది. గది పూర్తిగా చల్లబడిన తరువాత ఏసీని ఆపేసి ఫ్యాన్ స్పీడ్ పెంచితే అక్కడి చల్లదనం చాలాసేపటి వరకు రీ సర్క్యులేట్ అవుతుంది.
నైట్ బల్బులు, అలంకరణ లైట్లు, చార్జర్ పాయింట్లు, టీవీ, కంప్యూటర్ లాంటి వాటివల్ల గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. వీటిని పూర్తిగా స్విచ్ఛాఫ్ చేస్తే ఏసీని ఆపినా కూడా గది చల్లదనం చాలాసేపటి వరకు నిలిచి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్